Rashmika: గూగుల్ లో హీరోయిన్ ను వెతుక్కుంటూ వెళ్లాడు, హైదరాబాద్ లో ?, పోలీసులు ఎంట్రీతో !

బెంగళూరు/మడికేరి: బాహుబాష నటి, కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్నను ఎలాగైనా కలవాలని ఆమె వీరాభిమాని డిసైడ్ అయ్యాడు. హైదరాబాద్ లో రష్మిక మందన్నను కలవడానికి ఆ వీరాభిమాని అనేక ప్రయత్నాలు చేశాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు పూర్తిగా నిలిపివేయడంతో రష్మికను కలవడం అతనికి సాధ్యం కాలేదు. అంతే రైలులో మైసూరు చేరుకున్న ఆ వీరాభిమాని తరువాత రష్మిక తండ్రి ఇంటి దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించాడు. గూగుల్ లో సెర్చ్ చేసిన గూగుల్ తల్లి సూచనలతో ఆ వీరాభిమాని ఓ చోటకు వెళ్లి రష్మిక ఇల్లు ఎక్కడ ?, ఆమె ఎక్కడున్నారు ?, ఏమి చేస్తున్నారు ? అంటూ ఆరా తీశాడు. మనోడి దెబ్బతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వీరాభిమాని చెప్పిన మాటలకు స్థానికులు బిత్తరపోయారు.

 హైదరాబాద్ టూ మైసూరు

హైదరాబాద్ టూ మైసూరు


ప్రముఖ నటి, హాట్ బ్యూటీ రష్మిక మందన్న సొంత ఊరు కర్ణాటకోని వీరరాజపేట. తెలంగాణకు చెందిన అకాశ్ త్రిపాఠి హీరోయిన్ రష్మిక మందన్నకు వీరాభిమాని అని సమాచారం. బాహుబాష నటి, కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్నను ఎలాగైనా కలవాలని ఆమె వీరాభిమాని అకాశ్ త్రిపాఠి డిసైడ్ అయ్యాడు. హైదరాబాద్ లో రష్మిక మందన్నను కలవడానికి ఆకాశ్ త్రిపాఠి అనేక ప్రయత్నాలు చేశాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు పూర్తిగా నిలిపివేయడంతో రష్మికను కలవడానికి ఆకాశ్ త్రిపాఠికి సాధ్యం కాలేదు.

రష్మిక అంటే పిచ్చి........ఛలో కర్ణాటక

రష్మిక అంటే పిచ్చి........ఛలో కర్ణాటక

గూగుల్ లో రష్మిక మందన్న ఎక్కడ ఉంటుంది ? అని ఆకాశ్ త్రిపాఠి వెతకడం మొదలుపెట్టాడు. కర్ణాటకలోని వీరాజపేటలో రష్మిక మందన్న సొంత ఇల్లు ఉందని ఆమె వీరాభిమాని ఆకాశ్ త్రిపాఠి తెలుసుకున్నాడు. అంతే రైలు ఎక్కిన ఆకాశ్ త్రిపాఠి నేరుగా కర్ణాటకలోని మైసూరు సిటీకి చేరుకున్నాడు.

పాతాళభైరవి సినిమా టైపులో ప్రయాణించాడు

పాతాళభైరవి సినిమా టైపులో ప్రయాణించాడు

మైసూరు నుంచి వీరాజపేట ఎలా చేరుకోవాలి అంటూ ఆకాశ్ మళ్లీ గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేశాడు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి సినిమా ఆకాశ్ కు గుర్తు వచ్చింది. ఆకాశ్ ఓ గూడ్స్ ఆటో ఎక్కి వీరాజ్ పేట చేరుకున్నాడు. వీరాజ్ పేట్ లో రష్మిక మందన్న ఎక్కడ ఉంటున్నారు అని తెలుసుకోవడానికి ఆకాశ్ మళ్లీ గూగుల్ లో సర్చ్ చేశాడు.

 గూగుల్ తల్లి మ్మాప్ లో ఏం చూపించిందంటే ?

గూగుల్ తల్లి మ్మాప్ లో ఏం చూపించిందంటే ?


గూడ్స్ ఆటోలో వీరాజ్ పేట చేరుకున్న ఆకాశ్ మళ్లీ ఇబ్బంది పడ్డాడు. ఆకాశ్ కు కన్నడ బాష రాకపోవడం, స్థానికులకు తెలుగు రాకపోవడంతో ఆకాశ్ మళ్లీ అతని పాత తెలివి ఉపయోగించి గూగుల్ లో మందన్న అని టైప్ చేశాడు. గూగుల్ మ్యాప్ ఎలా చూపిస్తుందో అలాగే నేరుగా వీరాజపేట తాలుకాలోని మగ్గుల అనే ఊరిలోని తోటలో ఉన్న ఓ ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఆ ఇల్లు రష్మిక తండ్రి మందన్న ఇల్లు.

బిత్తరపోయి పోలీసులను పిలిపించిన స్థానికులు

బిత్తరపోయి పోలీసులను పిలిపించిన స్థానికులు


గూగుల్ మ్యాప్ లో చూపించిన తోటలోని ఇంటి దగ్గరకు వెళ్లిన ఆకాశ్ త్రిపాఠి రష్మిక మందన్న ఎక్కడ ?, ఆమె ఎక్కడున్నారు ?, షూటింగ్ లు లేవు కదా, ఆమె ఏం చేస్తున్నారు ? అంటూ స్థానికులను రకరకాలుగా ప్రశ్నించాడు. వీడెవడో వచ్చేశాడు అంటూ బిత్తరపోయిన స్థానికులకు అనుమానం వచ్చి సీక్రెట్ గా పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని పిలిపించారు.

బాబూ.... కరోనా టైమ్ లో నీకు ఇంత సాహసం అవసరమా ?

బాబూ.... కరోనా టైమ్ లో నీకు ఇంత సాహసం అవసరమా ?


పోలీసులు వచ్చి ఆకాశ్ ను విచారణ చెయ్యగా అతను తాను రష్మిక మందన్న వీరాభిమాని అని చెప్పాడు. ఆకాశ్ వెళ్లిన ఇల్లు రష్మిక తండ్రి మందన్న ఇల్లు. గూగుల్ లో ఆకాశ్ కు రష్మిక తండ్రి మందన్న ఇల్లు చూపించింది. ప్రస్తుతం కరోనా వైరస్ తాండవం చేస్తుంటే నువ్వు తెలంగాణ నుంచి ఇక్కడికి ఎగేసుకుంటా వచ్చావు, నువ్వు ఆమెను కలవాలంటే హైదరాబాద్ లో కలువు, ఇలా నువ్వు పోలో అంటూ తిరిగేస్తే కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని పోలీసులు అతనికి బుద్దిమాటలు చెప్పారు.

చాన్స్ లేకపోవడంతో హైదరాబాద్ కు రిటన్

చాన్స్ లేకపోవడంతో హైదరాబాద్ కు రిటన్


హీరోయిన్ రష్మిక మందన్న మగ్గుల ఊర్లో కాకుండా వీరాజపేటలో ఉంటున్నది. పోలీసులు బుద్దిమాటలు చెప్పి ఆకాశ్ ను మళ్లీ మైసూరుకు పంపించి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోవాలని సూచించారు. ఆకాశ్ కు కన్నడ బాష రాకపోవడం నానా తంటాలు పడి రష్మిక మందన్నను కలవడానికి అవకాశం లేకపోవడంతో నిరాశగా మళ్లీ తెలంగాణ బయలుదేరాడని స్థానికులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+