హరీష్ పూజారి హత్య: గుజరాత్‌లో అరెస్టు

మంగళూరు: కర్ణాటకలోని మడికేరిలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల సందర్బంగా జరిగిన గొడవలను వ్యతిరేకిస్తూ బంట్వాళలో నిర్వహించిన ర్యాలీ సందర్బంగా హత్యకు గురైన హరీష్ పూజారి హత్య కేసులో ప్రముఖ నిందితుడిని పోలీసులు గుజరాత్ లో అరెస్టు చేశారు.

గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో తలదాచుకున్న ప్రముఖ నిందితుడు రవిరాజ్ ను అరెస్టు చేసిన బంట్వాళ గ్రామీణ పోలీసులు బుధవారం బంట్వాళ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నిందితుడిని 15 రోజులు రిమాండ్ కు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే హరీష్ పూజారి హత్య కేసులో భువిత్ శెట్టి, అచ్యుత్ అనే ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. ప్రముఖ నిందితుడు రవిరాజ్ హత్య జరిగిన తరువాత అహ్మదాబాద్ పారిపోయి అతని చిన్నాన్న ఇంటిలో తలదాచుకున్నాడని పోలీసులు చెప్పారు.

 Raviraj arrested at Ahmedabad in Gujarat

2015 నవంబర్ నెలలో మడికేరిలో టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆ సందర్బంలో మడికేరిలో గొడవలు జరిగాయి. మడికేరిలోని గొడవలను ఖండిస్తూ నవంబర్ 12వ తేదిన బంట్వాళలో భారీ ర్యాలీ, ధర్నా కార్యక్రమం జరిగింది.

ర్యాలీ, ధర్నాలో పాల్గోన్న హరీష్ పూజారి తరువాత స్నేహితుడితో కలిసి బైక్ లో బయలుదేరాడు. అదే సమయంలో మారుతి వ్యాన్ లో వచ్చిన నలుగురు హరీష్ పూజారిని దారుణంగా హత్య చేసి పరారైనారని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+