రూ.500 నోట్లపై స్టార్ గుర్తు ఉందా- రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన
ముంబై: ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లపై స్టార్ గుర్తు ఉంటోంది. 500 రూపాయలతో పాటు ఇతర డినామినేషన్ల నోట్లపై కుడివైపు కింది భాగంలో ముద్రించి ఉండే సిరీస్ నంబర్ల మధ్యలో ఈ స్టార్ గుర్తు కనిపిస్తోంది. అలాంటి నోట్లు- నకిలీవనే ప్రచారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై జోరుగా సాగుతోంది. అవి ఫేక్ నోట్లు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటివరకు చలామణిలో ఉన్న బ్యాంక్ నోట్లపై స్టార్ గుర్తు కనిపించడం అసాధారణమే. ఇలాంటి సింబల్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన సందర్భాలు లేవు. ఇలాంటి ఎక్స్‌ట్రా సింబల్స్‌ను నోట్లపై ప్రింట్ చేయడానికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్.. గతంలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను కూడా లేదు.

ఈ మధ్యకాలంలో మాత్రం సిరీస్ నంబర్ల వద్ద స్టార్ గుర్తు కనిపించడం సాధారణంగా మారింది. అవి నకిలీ నోట్లు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది. స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలీవి కావని తేల్చి చెప్పింది. అవి చెల్లుబాటు అవుతాయనీ స్పష్టం చేసింది. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్లు కూడా ఇతర కరెన్సీలతో సమానమైనవేనని వివరించింది.
నంబరింగ్ ప్యానెల్‌లో, ప్రిఫిక్స్, క్రమ సంఖ్య మధ్య స్టార్ గుర్తు ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. స్టార్ సింబల్ ఉంటే- ఆ నోట్ రీప్లేస్ చేసినట్టు లేదా రీప్రింట్ చేసినట్లుగా గుర్తించాలని సూచించింది. పాత నోటును రీప్లేస్ చేయడమో లేక రీప్రింట్ చేసినప్పుడు దానికి గుర్తుగా ఈ స్టార్‌ను వినియోగిస్తోన్నట్లు వివరణ ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్.

లోపభూయిష్టంగా ఉండటం వల్ల గతంలో జారీ చేసిన వంద బ్యాంక్ నోట్ల కట్టలను సరిచేసి, వాటిని మళ్లీ రీప్రింట్ చేయాల్సి వచ్చిందని, ఆ సందర్భంగా ఈ స్టార్ గుర్తును నంబరింగ్ ప్యానెల్‌లో జత చేయాల్సి వచ్చిందని పేర్కొంది. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్ల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications