Raguram Rajan: మోదీ సర్కార్‌పై రఘురామ్ రాజన్ ప్రశంసలు.. యూటర్న్ ఎందుకు..?
Indian Economy: మాజీ రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఎల్లప్పుడూ భారత ఆర్థిక వ్యవస్థపై తన ఆలోచనలను పంచుకుంటారని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో చాలాసార్లు దేశంలో యువతకు తగిన స్థాయిలో ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యలపై తన విశ్లేషణను వెల్లడిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా మోదీ సర్కార్ చేపట్టిన చర్యలను కొనియాడారు.
గత 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల రంగంలో మోదీ ప్రభుత్వం చేసిన కృషిని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాజాగా ప్రశంసించారు. దేశానికి కీలకమైన ఈ రంగంలో భారత్ బాగా పనిచేసిందని అన్నారు. అయితే ఇదే క్రమంలో దేశీయ ఉత్పత్తి, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడానికి ఇతర రంగాల్లో మరిన్ని ప్రయత్నాలు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో కేంద్రం ప్రభుత్వం వస్తుసేవల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఈ పని సరిగ్గా చేయటం చాలా ముఖ్యమన అడుగుగా రాజన్ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం మంచిదేనని ఈ సందర్భంగా రాజన్ పేర్కొన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో మనం చాలా చేశామని అనుకుంటున్నాను. ఇతర ప్రాంతాల్లో అవసరమైన చర్యల గురించి ప్రభుత్వం తన విమర్శకుల నుంటి సమాచారాన్ని సేకరించి తదనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం గురించి రాజన్ నొక్కి చెప్పారు. దీనిపై దృష్టి సారిస్తే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ బలపడుతుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ దశాబ్దంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా.. అలాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారటానికి 7 శాతం వృద్ధి రేటు సరిపోతుందా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 7 శాతం చొప్పున వృద్ధి సాధిస్తే జర్మనీని వెనక్కి నెట్టివేస్తామని రాజన్ అన్నారు. తప్పకుడా రానున్న రోజుల్లో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించటం అసాధ్యమైన విషయం కాదన్న రాజన్.. అభివృద్ధి చెందిన దేశం అని చెప్పినప్పుడు, ఏది అభివృద్ధి చెందిందో మనం తనిఖీ చేయాలా? అన్నారు. అయితే ఇప్పటికీ దేశంలో విద్యా రంగంపై అత్యంత ప్రాధాన్యత ముఖ్యమని రఘురామ్ రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications