ఆ పదవి నుండి తప్పుకోవాలి, లేకపోతే చంపేస్తామంటూ ఉర్జిత్ కు లేఖ

ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను చంపేస్తామంటూ మహరాష్ట్రలోని నాగపూర్ కు చెందిన వైభవ్ బదల్పార్ అనే వ్యక్తి బెదిరింపు ఈమెయిల్ పంపాడు. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

ముంబై:ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు ఓ వ్యక్తి చంపుతానని బెదిరిస్తూ ఈ మెయిల్ పంపాడు. ఈమెయిల్ కలకలాన్ని రేపింది. ఆర్ బి ఐ గవర్నర్ పదవి నుండి తప్పుకోవాలని చంపేస్తామంటూ ఆగంతకుడు ఉర్జిత్ పటేల్ కు లేఖ రాశాడు.

ఆర్ బి ఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ నిర్ణయాన్ని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శించాయి.

RBI governor gets threat email to quit

అయితే ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను బెదిరిస్తూ శనివారం నాడు 34 ఏళ్ల వైభవ్ బదల్పార్ అనే వ్యక్తి ఈమెయిల్ పంపాడు. ఈ వ్యక్తిని నాగపూర్ లో పోలీసులు అదుపులోకి తీసుకొన్నాడు.

ఉర్జిత్ పటేల్ తో పాటు అతడి కుటుంబసభ్యులను కూడ చంపేస్తానంటూ నిరుద్యోగి అయిన బదల్పార్ ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడిని ముంబైకి తరలించిన పోలీసులు ఐపిసి 506(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+