కొత్త రూ.50 నోట్లు ఇవేనా? నోటుపై దక్షిణాది ఆలయం
త్వరలో రూ.50 కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రూ.50లు కూడా చలామణీలో ఉంటాయని తెలిపింది.
న్యూఢిల్లీ: త్వరలో రూ.50 కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రూ.50లు కూడా చలామణీలో ఉంటాయని తెలిపింది.
పెద్ద నోట్ల రద్దు అనంతరం కొత్త రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన ఆర్బీఐ కొత్తగా రూ.50, రూ.20 నోట్లను కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

అయితే, ఈ కొత్త రూ.50 నోటుకు సంబంధించిన చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లతో పోలిస్తే వీటి రంగులో పూర్తి వ్యత్యాసం కనిపిస్తోంది.
మహాత్మా గాంధీ సిరీస్ 2005లో వస్తున్న ఈ నోటు వెనుక భాగంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉండనుంది. తాజాగా తీసుకొస్తున్న నోటు వెనక భాగంలో దక్షిణ భారతానికి చెందిన ఓ ఆలయం చిత్రం ఉంటుందని సమాచారం.












Click it and Unblock the Notifications