కీలక వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ: స్టాక్ మార్కెట్లు పతనం
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో కీలక వడ్డీరేట్లు తగ్గుతాయన్న విశ్లేషకుల అంచనాలపై ఆర్‌బీఐ నీళ్లు చల్లింది. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్‌బీఐ బుధవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత తొలిసారి రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. అయితే, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో కీలక వడ్డీరేట్లు తగ్గుతాయన్న విశ్లేషకుల అంచనాలపై ఆర్‌బీఐ నీళ్లు చల్లింది. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్‌బీఐ బుధవారం ప్రకటించింది.
సీఆర్‌ఆర్‌పై ఆర్‌బీఐ వెనక్కి
నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ని 100శాతానికి పెంచుతూ భారతీయ రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. బుధవారం జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. డిసెంబర్ 10 నుంచి ఇది అమల్లోకి రానుంది.
సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 11 మధ్య బ్యాంకుల్లోకి వచ్చిన మొత్తం అదనపు నగదును సీఆర్‌ఆర్(బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన మొత్తం) కింద పక్కన పెట్టాలని ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకుల నుంచి రూ.3లక్షల కోట్లు ఆర్‌బీఐకి వెళ్లాల్సి ఉంది. అయితే ఇది తాత్కాలిక చర్యేనని ఆర్‌బీఐ అప్పట్లోనే ప్రకటించింది. తాజాగా దీనిని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.
{photo-feature}












Click it and Unblock the Notifications