వృద్ధిరేటు అంచనా తగ్గించిన ఆర్బీఐ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్ 7.4గా నమోదవుతుందని ఫిబ్రవరిలో ప్రకటించిన కేంద్ర బ్యాంకు ప్రస్తుతం ఆ అంచనాను 7.2 శాతానికి పరిమితం చేసింది. ఈ ఏడాది రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాను తగ్గించింది.
దేశీయంగా పెట్టుబడులు తగ్గడం, మూలధన వస్తువుల ఉత్పత్తి తగ్గి దిగుమతులు పెరగడం జీడీపీపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. దీనికి తోడు ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక పరిణామాలు భారత ఎగుమతులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ఫలితంగా అది వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటోంది. అయితే కమర్షియల్ సెక్టార్‌లో నిధుల వెల్లువ ఆర్థిక వ్యవస్థను ఒడిదొడుకులకు లోనుకాకుండా చూస్తుందని ఆర్బీఐ ఆశిస్తోంది.

ఆర్బీఐ ప్రస్తుత అంచనాల ప్రకారం 2019-20లో భారత వృద్ధి రేటు 7.2శాతం నమోదుకానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో జీడీపీ గ్రోత్ రేట్ 6.8 నుంచి 71 శాతం ఉండొచ్చని, రెండో అర్థభాగంలో మాత్రం 7.3 నుంచి 7.4 శాతంగా నమోదుకావచ్చని అంచనా వేస్తోంది. ఎల్‌నినో ప్రభావం, ద్రవ్యోల్బణం, ఆహార పదార్థాల ఉత్పత్తి, డిమాండ్‌పై వృద్ధి రేటు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications