పేటీఎంపై మరో పిడుగు: తేల్చేసిన ఆర్బీఐ గవర్నర్

Paytm Payments Bank: ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌‌‌కు చెందిన పేటీఎం ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకింగ్ లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి స్పందించింది. కీలక ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం విధించిన అనంతరం ఆర్బీఐ స్పందించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కొద్దిరోజుల కిందటే రిజర్వ్ బ్యాంక్..కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా దీనిపై నిషేధం విధించింది. ఈ నెల 29వ తేదీ తరువాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోతాయి. పేటీఎం వ్యాలెట్స్, ఫాస్టాగ్ కూడా పని చేయవు.

RBI may not review its regulatory action against Paytm Payments Bank

దీని తరువాత పేటీఎం షేర్ల ధరలు ఢమాల్ అయ్యాయి. పాతాళానికి పడిపోయాయి. ఒకదశలో 52 వారాల్లో గరిష్ఠంగా 998 రూపాయల వరకు వెళ్లిన వాటి షేర్ ప్రైస్ ఒక్కసారిగా కూప్పకూలింది. 400 రూపాయల కంటే దిగువకు పడిపోయింది. కొద్దిరోజులుగా కొద్దిగా కోలుకుంటోంది. నేడు స్టాక్ మార్కెట్‌లో పేటీఎం సింగిల్ పీస్ ప్రైస్ రూ.422.20 పైసల వద్ద ట్రేడ్ అయింది.

ఈ పరిస్థితుల్లో పేటీఎంపై మరో బాంబు పేల్చింది ఆర్బీఐ. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై విధించిన నిషేధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పునఃసమీక్షించదలచుకోలేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తేల్చి చెప్పారు. అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఈ నిషేధం అనేది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కే తప్ప పేటీఎం యాప్‌కు వర్తించదంటూ క్లారిటీ ఇచ్చారు.

ఈ సాయంత్రం ఆయన ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్బీఐ కార్యకలాపాలకు సంబంధించిన ఎఫ్ఎక్యూలను ఈ వారంలోనే విడుదల చేయబోతోన్నామని శక్తికాంత దాస్ తెలిపారు. బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, కోఆపరేటివ్ బ్యాంకులు.. ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఈ ఎఫ్ఎక్యూలు ఉంటాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+