పెద్ద నోట్లు: డిసెంబర్ 30 వరకు ఎటిఎం చార్జీల రద్దు
ముంబయి: నగదు కొరతతో కష్టాల పాలైన ప్రజలకు కాస్తా ఊరట కలిగించడానికి సోమవారం రిజర్వు బ్యాంకు మరో నిర్ణయం తీసుకుంది ఏటీఎంల ద్వారా జరిపే అన్ని లావాదేవీలపై డిసెంబరు 30వ తేదీ వరకు ఛార్జీలను రద్దు చేసింది. ఇది సేవింగ్స్ బ్యాంకు ఖాతాదార్లకు వర్తిస్తుంది.
తమ బ్యాంకుల ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలలో ఎన్నిసార్లు లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర) జరిపినా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోరని సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి నెలకు అయిదు సార్లు, ఆరు మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు మూడు సార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ.20 వంతున వసూలు చేస్తారు.

పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కొత్త నోట్లు పొందడానికి పరిమితులు విధించడంతో ఏటీఎంల నుంచి పలుమార్లు నగదు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏటీఎం ఛార్జీలను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకొంది.
ఈ ఏడాది సెప్టెంబర్ చివరి లెక్కల ప్రకారం దేశంలో సగం అంటే2 లక్షల 18 వేల 542 ఎటిఎం కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. వంద రూపాయల నోట్లతో పాటు కొత్త 500, 2000 నోట్లకు అనుగుణంగా ఎటిఎం యంత్రాలను సరిచేయాల్సిన పరిస్థితిలో మిగతా ఎటిఎం కేంద్రాలు పడ్డాయి.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎటిఎం కేంద్రాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. పాత నోట్ల మార్పిడి, డబ్బు డ్రా, నగదు డిపాజిట్ల కోసం ప్రజలు ఎటిఎం కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఆరు మెట్రో నగరాలు - ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌రకాస బెంగళూరు, హైదరాబాద్‌ల్లో సేవింగ్స్ ఖాతా హోల్టర్లకు నెలలో మూడు ఉచిత లావాదేవీల నిర్వహణకు అవకాశం కల్పిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications