రూ.2000 నోట్ల చలామణిపై ఆర్బీఐ మరో సంచలన ప్రకటన
ముంబై: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి పుల్ స్టాప్ పడింది. ఇప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు ఇక తెరమరుగయింది. ఇకపై ఈ నోట్లేవీ మార్కెట్‌లో చెల్లుబాటు కావు. వీటిపై ఎలాంటి లావాదేవీలను కూడా నిర్వహించలేం. అందుబాటులో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది.
దేశంలో 2,000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. ఎలాంటి లావాదేవీలను కూడా స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ నోటు వాడకంలోనే ఉందని, రద్దు కాలేదనీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

పెద్ద నోట్ల డినామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ఈ ఏడాది మేలో ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ ఇవి చలామణిలోనే ఉంటాయంటూ అప్పట్లో వివరణ ఇచ్చింది. అయినప్పటికీ- 2,000 నోట్లను స్వీకరించడానికి వ్యాపార సంస్థలు పెద్దగా ముందుకు రాలేదు. వాటిని తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు.
పెట్రోల్ బంకుల్లో 2,000 డినామినేషన్ నోట్లను తీసుకోవడానికి అక్కడి సిబ్బంది ముందుకు రాలేదు. ట్యాంక్ ఫుల్ చేసుకున్నా గానీ తమ వద్ద చిల్లర లేదంటూ ముఖం మీదే తేల్చి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎల్పీజీ సిలిండర్ల డెలివరీలోనూ ఇదే తరహా సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. వ్యాపారస్తులు, చిల్లర వర్తకులు పెద్ద నోట్లను తీసుకోవడాన్ని ఎప్పుడో మానేశారు కూడా.
ఈ పరిస్థితుల మధ్య తాజాగా ఆర్బీఐ తాజా ప్రకటన వెలువడింది. 2,000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 3.62 లక్షల కోట్ల వరకు 2,000 నోట్ల రూపాయల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ ఏడాది మే 19వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.56 లక్షల కోట్లకు తగ్గింది.
జూలై 31వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది. ఆ నెల ప్రారంభంలో 3.14 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్‌లో చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లు అదే నెల 31వ తేదీ నాటికి 0.42 లక్షల కోట్లకు పడిపోయాయి. మే 19వ తేదీ నుంచి జులై 31వ తేదీ నాటికి 88 శాతం మేర నోట్లు తమ వద్ద జమ అయినట్లు ఆర్బీఐ తెలిపింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications