ఆర్‌కామ్‌ షేర్లు ఢమాల్: బ్యాంకులకు రుణ బకాయిల ఎఫెక్ట్!..

వడ్డీలను 90రోజుల పాటు చెల్లించకపోతే ఎస్‌ఎంఏ 3కేటగిరి కిందకు వస్తుంది. ఇదే జరిగితే.. బ్యాంకులు ఈ రుణాన్ని నిరర్థక ఆస్తిగా పరిగణించి చర్యలుచేపడతాయి.

ముంబై: దాదాపు 10బ్యాంకులకు ఆర్‌కామ్‌ రుణాలు బకాయి పడిందన్న ప్రచారంతో.. ఆ కంపెనీ అమ్మకాలు పతనమవవుతూ వస్తున్నాయి. ఇన్వెస్టర్లు నమ్మకం కోల్పోతుండటంతో ఆర్‌కామ్‌ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. సోమవారం ఒక్క ట్రేడింగ్ సెషన్ లోనే ఆర్‌కామ్‌ షేర్ ధర అత్యధికంగా రూ.5.60పైసలు నష్టపోయి రూ.19.70కు చేరింది.

కొద్దిసేపటికి కొంత పుంజుకుని 21.10వద్ద ప్రస్తుతం ఆర్‌కామ్‌ షేర్ ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం బ్యాంకులకు ఉన్న బకాయిలు ఎస్‌ఎంఏ 1( స్పెషల్‌ మెయింటెన్‌ అకౌంట్‌) గానీ ఎస్‌ఎంఏ 2 కిందకు గానీ వస్తాయి. వడ్డీలను 90రోజుల పాటు చెల్లించకపోతే ఎస్‌ఎంఏ 3కేటగిరి కిందకు వస్తుంది. ఇదే జరిగితే.. బ్యాంకులు ఈ రుణాన్ని నిరర్థక ఆస్తిగా పరిగణించి చర్యలుచేపడతాయి.

RCom shares plunge to all-time low on Q4 loss, debt woes

అదే సమయంలో ప్రముఖ రేటింగ్‌ సంస్థ కేర్‌ అండ్‌ ఇక్రా ఆర్‌కామ్‌ రేటింగ్‌ను తగ్గించడం దానిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రభావంతో షేర్ ధర తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, రిలయన్స్ జియో ప్రవేశం తర్వాత ఆర్‌కామ్‌కు బీబీబీ నుంచి బీబీ రేటింగ్‌ను వచ్చింది. ఇక టవర్ల వ్యాపారాన్ని విక్రయించి రుణాలు చెల్లించాలన్న ఆర్‌కామ్‌కు ప్రయత్నాలు కూడా షేర్లు భారీగా పతనమవడానికి కారణమైనట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+