ఒకే వేదికపై రజనీ, కమల్ హాసన్: రాజకీయాల్లో కమల్‌తో కలవడంపై సూపర్‌స్టార్
Recommended Video

రాజకీయాల్లో కమల్‌తో కలవడంపై సూపర్‌స్టార్ రజనీ !
చెన్నై: మరో ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చినా పోటీ చేయడానికి తాను సిద్ధమేనని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు. బుధవారం కమల హాసన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వ్యూహం గురించి తాను ఏమీ చెప్పబోనని, వేచి చూడాలన్నారు.
తమ ప్రణాళికలో భాగంగా తమ పార్టీ ఆఫీస్ బేరర్ల నియామకం జరుగుతోందన్నారు. కాగా, సినీ రంగంలో సన్నిహిత మిత్రుడైన కమల హాసన్‌తో తాను రాజకీయాల్లోనూ కలిసి పనిచేస్తానో లేదో అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుందన్నారు.

కమల హాసన్ రాజకీయ పార్టీకి అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 21న తమిళనాడు రామనాథపురంలో పార్టీ పేరు ప్రకటించి అదే రోజు ప్రజల్లోకి వెళ్తానని కమల్ హాసన్ చెప్పిన విషయం తెలిసిందే. కాగా, వీరిద్దరు బుధవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికను పంచుకున్నారు.












Click it and Unblock the Notifications