Ayodhya Ram Temple: రామమందిర ప్రాణప్రతిష్టకు శంకరాచార్యుల డుమ్మా అందుకేనా ?
అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. మరో వారం రోజుల్లో ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన క్రతువులు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో వీటితో పాటు ఆహ్వానాల వ్యవహారం పర్యవేక్షిస్తున్న అయోధ్య ట్రస్టుకు ఓ చిక్కు వచ్చి పడింది. నలుగురు శంకరాచార్యలు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాబోమని తేల్చిచెప్పేయడమే ఇందుకు కారణం.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి నలుగురు శంకరాచార్యులు రాకూడదని నిర్ణయం తీసుకోవడంతో వారిపైనా బీజేపీ నేతలు ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు శంకరాచార్యులు ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అందులో ఒకరైన స్వామి నిశ్చలానంద మహరాజ్ తాజాగా వెల్లడించారు. పూరీలోని శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి మహరాజ్ తమ నిర్ణయం వెనుక స్ధాపిత సంప్రదాయాల నుంచి ట్రస్టు దూరంగా జరగడమే ప్రధాన కారణంగా పేర్కొన్నారు.

జాతీయ మీడియా ఛానల్ ఎన్టీటీవీతో నిశ్చలానంద మాట్లాడుతూ.. శంకరాచార్యులు తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటారని, ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదన్నారు. ప్రధానమంత్రి మోడీ రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు మనం కేవలం బయట కూర్చుని చప్పట్లు కొట్టాలని భావిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. 'సెక్యులర్' ప్రభుత్వం ఉనికిలో ఉండటం అనేది సంప్రదాయాన్ని తుడిచిపెట్టడాన్ని సూచించదని నిశ్చలాంద వ్యాఖ్యానించారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications