వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rebel: సీఎం, ఆయన కొడుక్కి, సంజయ్ కి ఏక్ నాథ్ చాలెంజ్, ధైర్యం ఉంటే ఆ పేర్లు చెప్పండి, నాటకాలు!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/గుహవాటి: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేల్లో చాలా మంది మాతో టచ్ లో ఉన్నారని, త్వరలో సమస్యకు పరిష్కారం చిక్కుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అంటున్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరు మాతో టచ్ లో ఉన్నారని సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు. మంత్రి ఆదిత్యా ఠాక్రే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అంటున్నారు.

మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు సవాలు చేశారు. మీకు దమ్ముంటే మా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని, ప్రజల సమక్షంలో ఎవరు ఏమిటో అనే విషయం తేల్చుకుందామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే సవాలు చేశారు.

ఈ విషయాలపై ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శివసేన పార్టీ రెబల్ లీడర్, ఆ పార్టీ మంత్రి ఏక్ నాథ్ షిండే మొదటిసారి నోరు విప్పారు. మీకు ధైర్యం ఆ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్యా ఠాక్రే, సంజయ్ రౌత్ కు ఏక్ నాథ్ షిండే బహిరంగ సవాలు విసిరారు.

Rebel: అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ నిర్వహణకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము, సుప్రీం కోర్టు ఆదేశాలు, బిగ్ రిలీఫ్!Rebel: అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ నిర్వహణకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము, సుప్రీం కోర్టు ఆదేశాలు, బిగ్ రిలీఫ్!

సీఎం కొడుకు సవాల్

సీఎం కొడుకు సవాల్

మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు సవాలు చేశారు. మీకు దమ్ముంటే మా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని, ప్రజల సమక్షంలో ఎవరు ఏమిటో అనే విషయం తేల్చుకుందామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే ఇటీవల శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు సవాలు చేశారు.

రూటు మార్చిన సీఎం

రూటు మార్చిన సీఎం

రెబల్ ఎమ్మెల్యేల్లో చాలా మంది మాతో టచ్ లో ఉన్నారని, త్వరలో సమస్యకు పరిష్కారం చిక్కుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అంటున్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరు మాతో టచ్ లో ఉన్నారని సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు. మంత్రి ఆదిత్యా ఠాక్రే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియా ముందు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.

సుప్రీం కోర్టు తీర్పుతో రిలాక్స్

సుప్రీం కోర్టు తీర్పుతో రిలాక్స్

మహారాష్ట్ర అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని సీనియర్ శివసేన ఎమ్మెల్యేలు చేసిన మనవిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఫ్లోర్ టెస్టె నిర్వహించడానికి మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జులై 12వ తేదీ వరకు రెబల్ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ కు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

రెబల్ ఎమ్మెల్యేలు జులై 12వ తేదీ వరకు ధైర్యంగా ఉండటానికి అవకాశం చిక్కింది.

సీఎంకు సవాలు చేసిన ఏక్ నాథ్ షిండే

సీఎంకు సవాలు చేసిన ఏక్ నాథ్ షిండే

సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్యా ఠాక్రే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శివసేన పార్టీ రెబల్ లీడర్, ఆ పార్టీ మంత్రి ఏక్ నాథ్ షిండే మొదటిసారి గుహవాటిలోని హోటల్ లో నోరు విప్పారు. మీకు ధైర్యం ఉంటే మీతో టచ్ లో ఉన్న శివసేన రెబల్ మంత్రులు, ఆ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్యా ఠాక్రే, సంజయ్ రౌత్ కు ఏక్ నాథ్ షిండే బహిరంగ సవాలు విసిరారు.

మాతోనే ఉంటారు... మీ వెంటరారు

మాతోనే ఉంటారు... మీ వెంటరారు

మాతో చివరికి వరకు రెబల్ మంత్రులు, రెబల్ ఎమ్మెల్యేలు కలిసి ఉంటారని, అందులో ఎలాంటి డౌట్ లేదని ఏక్ నాథ్ షిండే ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్యా ఠాక్రే, సంజయ్ రౌత్ తదితరులు ప్రయత్నిస్తున్నారని ఏక్ నాథ్ షిండే ఆరోపించారు. ఏక్ నాథ్ షిండే కౌంటర్ తో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

English summary
Rebel: Maharashtra Minister Eknath Shinde challenges Shiv Sena leadership to name rebel MLAs who are in touch with them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X