Rebel: సీఎంకు సినిమా చూపించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ఓటింగ్, గ్రేట్ ఎస్కేప్ !
ముంబాయి/సూరత్: మహారాష్ట్రలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వానికి అధికార పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు చుక్కలు చూపించారు. మా సంకీర్ణ ప్రభుత్వంలోని ఆరు మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు కచ్చితంగా విజయం సాధిస్తారు అని చెప్పిన సీఎం ఉద్దవ్ ఠాక్రేకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సినిమా చూపించారు. బీజేపీ తమ అభ్యర్థులు అందరిని గెలిపించుకుని మరోసారి సత్తా చాటుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్వతో షాక్ తిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడింది ఎవరు ? అని సీఎం ఆరా తీస్తున్నారని తెలిసింది. సుమారు 20 మంది శివసేన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయారని తెలిసింది. అయితే శివసేనకు చెందిన కొందరు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లోని సూరత్ లోని ఓ ప్రముఖ హోటల్ లో మకాం వేశారు.

మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు
మహారాష్ట్రలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థు విజయం ఖరారు అయినా ఐదు అభ్యర్థిని బీజేపీ గెలిపించుకోవడంలో విజయం సాధించింది.

శివసేన, ఎన్సీపీలు ఓకే
మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వానికి అధికార పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు చుక్కలు చూపించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను, ఎన్సీపీ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకుంది.

కాంగ్రెస్ అభ్యర్థి ఢమాల్
కాంగ్రెస్ పార్టీ ఓ అభ్యర్థిని గెలిపించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన చంద్రకాంత్ హండోర్ ఓడిపోవడంతో అధికార పార్టీకి చెందిన నాయకులు షాక్ అయ్యారు. మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం వాళ్ల సొంత పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓంటింగ్ కు పాల్పడటంతో షాక్ కు గురైనారు.

సీఎంకు సినిమా చూపించిన ఎమ్మెల్యేలు
మా సంకీర్ణ ప్రభుత్వంలోని ఆరు మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు కచ్చితంగా విజయం సాధిస్తారు అని చెప్పిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సినిమా చూపించారు. బీజేపీ తమ అభ్యర్థులు అందరిని గెలిపించుకుని మరోసారి సత్తా చాటుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బతో షాక్ తిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరితో మంగళవారం మద్యాహ్నం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముంబాయిలోని సీఎం అధికారిక నివాసంలో శివసేన పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది.

ఆరా తీస్తున్నా సీఎం.... మైండ్ బ్లాక్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడింది ఎవరు ? అని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇప్పటికే ఆరా తీస్తున్నారని తెలిసింది. సుమారు 20 మంది శివసేన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయారని తెలిసింది. సంకీర్ణ ప్రభుత్వం నిలబెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోవడంతో సీఎం ఉద్దవ్ ఠాక్రే సీరియస్ అయ్యారని తెలిసింది.

సూరత్ హోటల్ లో రెబల్ ఎమ్మెల్యేలు
అయితే శివసేనకు చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు సుమారు 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లోని సూరత్ లోని ఓ ప్రముఖ హోటల్ లో మకాం వేశారు. సూరత్ లో మహారాష్ట్ర ఎమ్మెల్యేలు ఉన్న స్టార్ హోటల్ దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు ఎవ్వరూ హోటల్ లోకి వెళ్లడానికి పోలీసులు అవకాశం ఇవ్వడం లేదు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications