ఎట్టకేలకు: 6రోజుల తర్వాత కెనడా ప్రధానితో మోడీ ఆలింగనం, ఫ్యామిలీతో ఇలా

Recommended Video

    Canadian PM Justin Trudeau-Narendra Modi Meet Updates

    న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కుటుంబానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాదర స్వాగతం పలికారు. ట్రూడో కుటుంబం వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ వచ్చిన విషయం తెలిసిందే. వారు భారత్‌కు వచ్చిన ఆరు రోజుల తర్వాత మోడీ వారిని కలిశారు.

    గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ట్రూడో కుటుంబానికి ఘన స్వాగతం లభించింది. కారులో నుంచి దిగగానే ట్రూడోతో మోడీ కరచాలనం చేసి ఆలింగనం చేసుకున్నారు. ట్రూడో సతీమణితో కరచాలనం చేసి అనంతరం వారి పిల్లలను దగ్గరకు తీసుకున్నారు. ఆ తర్వాత గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ట్రూడో సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.

    Red carpet welcome for Canadian PM at Rashtrapati Bhavan, meets PM Modi

    గురువారం మధ్యాహ్నం మోడీ, ట్రూడో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. కెనెడాలో సిక్కు ఉగ్రవాదం గురించి, ఉగ్రవాద నిర్మూలనలో పరస్పర సహకారంపై వీరు చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, పౌర అణు సహకారం, అంతరిక్షం, వాతావరణ మార్పులు,, సహజ వనరులు, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

    ఇది ఇలావుంటే కెనడా ప్రధాని కుటుంబంతో సహా భారత్‌ విచ్చేయగా మోడీ వారిని ఆహ్వానించడానికి విమానాశ్రయానికి వెళ్లకపోవడం, గుజరాత్‌ పర్యటనకు కూడా వెంట వెళ్లకపోవడంపై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ గురువారం తన ట్విట్టర్‌లో ట్రూడోతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని, వారి పిల్లలను కలవడానికి ఆసక్తిగా ఉందని తెలుపుతూ 2015లో ట్రూడో, వారి కుమార్తె ఎల్లాతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు.

    కాగా, ముంబైలో కెనడా ప్రధానితో విందుకు ఖలిస్థాన్‌ ఉగ్రవాది జస్పాల్‌ అత్వాల్‌ను ఆహ్వానించడం, ఆయన ట్రుడో సతీమణితో ఫొటో దిగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+