Red Fort 2025 blast: ఎర్రకోట బ్లాస్ట్ వెనుక ఆల్ ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక బయటకు
దేశరాజధాని దిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద 2025 నవంబర్ లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ బ్లాస్ట్ లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ దాడి వెనకాల ఆల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్(AQIS) హస్తం ఉందని యూనైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్(UNSC) తన నివేదికలో వెల్లడించింది. యూఎన్ఎస్సీకు చెందిన అనలైటికల్ సపోర్ట్ అండ్ శాంక్చన్స్ మానిటరింగ్ టీమ్ ఈ విషయాలను వెల్లడించింది. AQIS విచ్ఛిన్నమైన ఓ చిన్న సంస్థ నుంచి క్రమంగా ప్రాంతీయ ఉగ్రవాద నెట్ వర్క్ సంస్థగా మారిందని పేర్కొంది. ఈ మేరకు 2025 నవంబర్ 10 న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో AQIS హస్తం ఉందని యూఎన్ఎస్సీ తన 38వ నివేదికలో తెలిపింది.
దక్షిణాసియాలో భారత్ తో పాటు పలు దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు AQIS ముప్పుగా మారే అవకాశం ఉందని యూఎన్ ఎస్సీ తన నివేదికలో పేర్కొంది. ఇక భారత్ లో AQIS తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రాంతీయ నెట్ వర్క్ లను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని నివేదికలో వెల్లడైంది. అంతేకాక తాలిబన్ల మద్దతుతో AQIS కు పలు ప్రాంతాల్లో సురక్షిత స్థావరాలు లభిస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఈ నివేదికలో స్పష్టం అయ్యాయి.
యూఎన్ఎస్సీ అందించిన ఈ తాజా నివేదిక ఇప్పుడు కీలకంగా మారనుంది. గతంలో ఇదే ఘటనపై జరిపిన దర్యాప్తులో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మెంబర్స్ తో సంబంధం ఉన్నట్లు తెలిపింది. జైషే మహ్మద్ ఉగ్రముఠాలు దక్షిణాసియాలో క్రియాశీలకంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయని స్పష్టం చేసింది. అంతర్జాతీయ నిఘా నుంచి తప్పించుకునేందుకు జైషే మహ్మద్ సంస్థ కొత్త పన్నాగాలను అన్వేషిస్తోందని స్పష్టం చేసింది. ఇక మరో రెండు రోజుల్లో భారత్ 80 వ స్వాతంత్ర్య దినోత్సవంలోకి అడుగుపెట్టనున్న తరుణంలో యూఎన్ఎస్సీ అందించిన నివేదిక కీలకంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఇప్పటికే దేశరాజధాని దిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

ఇక 2025 నవంబర్ 10న రాత్రి సమయంలో చారిత్రక ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో 11 మంది మృతి చెందారు. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) దర్యాప్తు చేస్తోంది. 11 మంది నిందితులపై 7,500 పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. విచారణలో భాగంగా 580 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 27 న ఛార్జిషీట్ ను పరిగణించి లిస్టు చేయనుంది.












Click it and Unblock the Notifications