Reena Dwivedi: ఆమెను చూస్తే ఇక ఆగుతారా : సెల్ఫీల కోసం ఎగబడుతూ - స్పెషల్ లుక్ లో..!!
ఉత్తర ప్రదేశ్ లో నాలుగో విడత పోలింగ్ ఉత్కంఠగా సాగుతోంది. పోటీలో ఉన్న అభ్యర్ధులు ఓటింగ్ తీరు పై టెన్షన్ గా కనిపిస్తున్నారు. కానీ ఆ పోలింగ్ బూత్ వద్ద ఓ పోలింగ్ అధికారి ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. ఈ మహిళా అధికారి పేరు రీనా ద్వివేది. 2019 సాధారణ ఎన్నికల వేళ పసుపు చీర కట్టుకొని చలువ కళ్లజోడు, ఓ చేతిలో ఈవీఎం ఉన్న బ్యాక్స్, మరో చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని అందంగా కనిపించిన ఆ యువ అధికారి.. అప్పట్లో సామాజిక మాధ్యమాలను షేక్ చేశారు. ఈ రోజు ఎన్నికల్లొ మరోసారి ట్రెండింగ్ అవుతున్నారు.
2017 నుంచి స్పెషల్ ఎట్రాక్షన్
అదే లుక్ లో ఉత్తర ప్రదేశ్ పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించారు. ఆ సమయంలో అద్బుతమైన లుక్ లో కనిపించిన రీనా ద్వివేది ఆ ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. పసుపు రంగు చీర కట్టుకున్న ఈ మహిళా పోలింగ్ అధికారి ఫొటో అప్పుడు సెన్సెషనల్‌గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రీనా ద్వివేదీ మరోసారి ట్రెండింగ్ గా మారారు. ఈసారి ఆమె వేరే గెటప్‌లో కనిపించారు. స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్, లేత గోధుమరంగు ప్యాంటుతో రీనా ట్రెండీ లుక్‌లో దర్శనమిచ్చారు. ఎన్నికలు వచ్చిన సమయంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు.

ఈ రోజు సైతం అదే ఆకర్షణతో
పోలింగ్ విధుల్లో దర్శనమిచ్చే ఈ మహిళా అధికారిణి..అయిదేళ్లుగా గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం లక్నో జిల్లా గోసాయిగంజ్ బూత్ నంబర్ 114లోని బస్తియాలోని పోలింగ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో చీరలో కనిపించిన రీనా..ఈ సారి తన లుక్ లో మార్పు పైన స్పందించారు. దీని పైన మీడియా ప్రశ్నించింది. దీంతో.. కొంచెం మార్పు అవసరమంటూ రీతా సైతం చమత్కరించారు. ఎన్నికల విధుల కోసం వచ్చిన ఆమెను చూసి పోలింగ్ సిబ్బంది సెల్ఫీల కోసం ఎగబడటం కామన్ అయిపోయింది.

సెల్పీల కోసం ఎగబడుతూ.. ట్రెండింగ్ లో
ఆ అధికారి వస్త్రధారణ చూసి అక్కడి అధికారులు, జనం ఆశ్చర్యపోయారు. రీనా ద్వివేది ఉత్తర్‌ప్రదేశ్ ప్రజాపనుల శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన ఆ అధికారి..ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారారు. దేశవ్యాప్తంగా గుర్తింపు లభించడం పట్ల గతంలో సంతోషం వ్యక్తం చేశారు రీనా ద్వివేది. ఇక, ఇప్పుడు సైతం ఈ అధికారి ఫొటోలు..ఓటింగ్ విధులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications