హానీమూన్‌లో సెక్స్ వద్దంటే క్రూరత్వంకాదు: బాంబే కోర్టు
ముంబై: హానీమూన్ సమయంలో జీవిత భాగస్వామితో సెక్సులో పాల్గొనడానికి నిరాకరించడం క్రూరత్వం కిందకు రాదని, దాని ప్రాతిపదికగా ఆ జంటకు విడాకులు ఇవ్వలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
హానీమూన్ సమయంలో సెక్సులో పాల్గొనడానికి భార్య విముఖత వ్యక్తం చేసిందని, ఇది క్రూరత్వం కిందకు వస్తుందని భర్త తరఫు న్యాయవాది వాదనతో కుటుంబ న్యాయస్థానం ఏకీభవించింది. ఆ తీర్పును బాంబే హైకోర్టు కొట్టివేసింది.
అంతేకాకుండా పెళ్లైన కొత్తలో భర్తతో గడపకుండా ఉద్యోగ నిమిత్తం ఊరు వదిలి వెళ్లి పోవడం, పురుషుల మాదిరిగా వస్త్రధారణను భర్త పట్ల ఆమెది మానసిక క్రూర ప్రవర్తనగా పేర్కొనలేమని కోర్టు స్పష్టం చేసింది.

వైవాహిక జీవితాన్ని మొత్తంగా పరిగణలోకి తీసుకోవాలే తప్ప.. ఏదో కొద్ది సమయంలో కొన్ని సంఘటనలను పరిగణలోకి తీసుకోని.. దానిని క్రూరత్వంగా గుర్తించలేమంది. చాలాకాలం పాటు తప్పుడు ప్రవర్తన కలిగి ఉండటం, దాని వల్ల బంధం క్షీణించడం... ఆ కారణంగా భాగస్వామితో ఇక కలిసి జీవించలేమన్న స్థితికి చేరినప్పుడే మానసిక హింసకు గురయినట్లుగా భావించాలని పేర్కొంది.
2009లో పెళ్లైన ఓ జంటకు సంబంధఇంచిన కేసులో.. హానీమూన్‌కి వెళ్లినప్పుడు శృంగారానికి అంగీకరించలేదని, పలు ఇతర కారణాలు చూపి భర్త విడాకులు కోరారు. వారికి కుటుంబ న్యాయస్థానం 2012లో విడాకులు మంజూరు చేసింది. దానిని వ్యతిరేకిస్తూ అతడి భార్య హైకోర్టులో అప్పీల్ చేయగా... ధర్మాసనం కుటుంబ న్యాయస్థానం తీర్పును తోసిపిచ్చింది.












Click it and Unblock the Notifications