సెక్స్‌కు భార్య నో: పురుషాంగం కోసుకున్న వ్యక్తి

భార్య సెక్స్‌కు నిరాకరించడంతో ఆగ్రహం చెందిన ఓ వ్యక్తి తన పురుషాంగాన్ని కోసేసుకున్నాడు. భార్యకు గుణపాఠం చెప్పాలని అతను ఆ పనిచేశాడు.

లక్నో: భార్య సెక్స్‌కు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి, ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన పురుషాంగాన్ని కోసుకున్నాడు. గత దశాబ్ద కాలంగా ఆమె అతనితో శృంగారానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. భార్యకు గుణపాఠం చెప్పాలని అతను ఆ పనికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది.

డైలీ మెయిల్ కథనం ప్రకారం - ఘాషీ రామ్ అనే 37 ఏళ్ల వ్యక్తి ఓ రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. సెక్స్ కోసం భార్యను దువ్వాడు. మంఝ్రీ దేవి (34) అందుకు నిరాకరించింది. దీంతో అతను కత్తి తీసి తన పురుషాంగాన్ని కోసేసుకున్నాడు.

Refused sex for a decade, UP man cuts off penis

దాంతో దిగ్భ్రాంతికి గురైన మంఝ్రీ సాయం కోసం కేకలు పెట్టింది. వైద్యులు ఇంటికి పరుగెత్తుకొచ్చారు. తనపై అతను చేసిన ఆరోపణను మంఝ్రీ తోసిపుచ్చుతోంది. ప్రతి రోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడని, తాను ఎంత చెప్పినా వినకపోవడంతో పాటు తనను పట్టించుకోవడం లేదని చెప్పింది.

తాగి ఉండడం వల్ల తాను సెక్స్ వద్దని చెప్పానని, తనకు కోపం వచ్చి అలా నిరాకరించానని, ఇప్పుడు తనను నిందిస్తున్నాడని ఆమె అంటోంది. తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, గత 10, 12 ఏళ్లుగా తనతో సెక్స్‌కు నిరాకరిస్తోందని అతను చెబుతున్నాడు.

వారిద్దరికి 18 ఏళ్ల క్రితం పెళ్లయింది. వారికి ఓ కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+