ఓటీటీ, వెబ్‌సైట్ల నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థ.. ఎందుకంటే...
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై ఆంక్షలు ఉంటాయి. ప్రింట్ మీడియాపై నియంత్రణ కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండగా.. ఎలక్ట్రానిక్ మీడియాపై అదుపు కోసం కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రెగ్యులేషన్ చట్టం ఉంది. అయితే వెబ్ మీడియా, ఓటీటీపై ఎలాంటి చట్టం, వ్యవస్థ లేదు. ఏ కథనం రాస్తున్నారు/ వీడియో ప్లే చేస్తున్నారు. దీనిపై కేంద్రం ఫోకస్ చేసింది. ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలని అనుకుంటోంది.
డిజిటల్ మీడియాను కట్టడి చేసేందుకు సెల్ఫ్ రెగ్యులేటరీ వ్యవస్థను, సంబంధిత చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దేశంలో 100కి పైగా న్యూస్ కంటెంట్ వెబ్ సైట్లు, 40కి పైగా ఓటీటీ వేదికలు ఉన్నాయి. వీటిపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఓ చట్టం ఉండాలని కేంద్రం అనుకుంటోంది. న్యూస్ వెబ్ సైట్ల నుంచి ఫేక్ న్యూస్ వస్తున్నాయని, ఓటీటీ వేదికల నుంచి కూడా భాషా సంబంధిత ఫిర్యాదులు, వీడియో కంటెంట్ పై అభ్యంతరాలు వస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు.

ఫిర్యాదులపై స్పందించేందుకు ఓ వ్యవస్థ అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నూతనంగా తీసుకువచ్చే చట్టంలో డిజిటల్ మీడియా స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. కథనం/ భాషా, వీడియో కంటెంట్‌ను మానిటరింగ్ చేస్తుందని వివరించారు. ఓటీటీ/ వెబ్ సైట్లను మానిటరింగ్ చేయడంతో విచ్చలవిడి తనాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇకపై అసభ్య పదజాలం/ వీడియో కంటెంట్ కంట్రోల్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటోంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications