మోదీతో బాబు అలా- పవన్ ఇలా: ట్రీట్‌మెంట్

Rekha Gupta: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12:35 నిమిషాలకు రామ్‌లీలా మైదాన్‌లో లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఆరుమంది- పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, ఆతిష్ సూద్, మన్జీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్.. మంత్రులుగా ప్రమాణం చేశారు.

తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నిక..

రేఖా గుప్తా తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి విజయఢంకా మోగించారు. తన ప్రత్యర్థి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బందన కుమారిని 29 వేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు. తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ- ముఖ్యమంత్రి పీఠం ఆమెకే దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహానికి అద్దం పట్టింది.

Rekha Gupta oath taking ceremony PM Modi greets AP CM Chandrababu and Pawan Kalyan

నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా..

ఢిల్లీని పరిపాలించే నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా చరిత్ర సృష్టించారు. గతంలో బీజేపీ నుంచి సుష్మ స్వరాజ్, కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్ హస్తినాపురిని ఏలారు. ఆ తరువాత ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆతిషి కొంతకాలం పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి తరువాత తాజాగా మహిళకే పట్టం దక్కింది.

మోదీ- షా..

ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ- ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఇందులో పాల్గొన్నారు. రేఖా గుప్తా, ఆమె మంత్రివర్గ సహచరులకు అభినందనలు తెలియజేశారు.

Rekha Gupta oath taking ceremony PM Modi greets AP CM Chandrababu and Pawan Kalyan

ఆప్యాయంగా పలకరింపు..

ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ప్రమాణ స్వీకారానికి కొద్ది నిమిషాలు ముందే ప్రధాని మోదీ వేదికపైకి చేరుకున్నారు. అక్కడున్న కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆప్యాయంగా పలకరించారు. వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. తొలుత- ప్రమోద్ సావంత్, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండేలతో మాట్లాడారు.

గట్టిగా నవ్విన పవన్..

ఆ తరువాత పవన్ కల్యాణ్ వద్దకు వచ్చారు. కొన్ని సెకెండ్ల పాటు ఆయనతో నవ్వుతూ మాట్లాడారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. పవన్ ఎదురుగా నిల్చున్న మోదీ ఏదో చెబుతూ చేతులు ఊపడం, దానికి పవన్ కల్యాణ్ గట్టిగా నవ్వడం కనిపించింది. ఆ సమయంలో పవన్ పక్కనే ఉన్నారు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆ తరువాత చంద్రబాబు వద్దకు వచ్చారు. నవ్వుతూ పలకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+