Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆధార్-పాన్‌కార్డుపై మరో వెసులుబాటు, ఇలా అనుసంధానం..

పాన్‌కార్డుతో ఆధార్‌ను అనుసంధానంపై ఆదాయపు పన్ను విభాగం మరో అవకాశం కలిగించింది. ఇప్పటికే ఆన్‌లైన్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: పాన్‌కార్డుతో ఆధార్‌ను అనుసంధానంపై ఆదాయపు పన్ను విభాగం మరో అవకాశం కలిగించింది. ఇప్పటికే ఆన్‌లైన్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది.

తాజాగా కాగితంపై దరఖాస్తు చేసుకునే వీలును కలిగించింది. ఈ దరఖాస్తు ఒక పేజీ మాత్రమే ఉంటుంది. ఆధార్, పాన్‌కార్డులలో నమోదయిన పేరు స్పెల్లింగ్ తేడా, లేదా తేదీ తేడా ఉంటే దానిని పేర్కొనాలి. వీటిని సంబంధిత ఆఫీస్‌కు పంపించాలి.

Relax! You can still link your Aadhaar with PAN card - your PAN isn't invalid just yet

ఎలా దరఖాస్తు చేయాలంటే...

ఆధార్ సంఖ్య
పాన్‌కార్డ్ నెంబర్
ఆధార్‌లో నమోదయిన పేరు
పాన్ కార్డులో నమోదయిన పేరు
ఈ ఆధార్ సంఖ్యను ఇతర పాన్‌కార్డుతో అనుసంధానం చేయడానికి సమర్పించలేదంటూ ధృవీకరణ పత్రం ఇవ్వాలి.
ఇందులో పేర్కొన్నది తప్ప మరో పాన్ కార్డు లేదని ఇంకో ధృవీకరణ పత్రం ఇవ్వాలి.

పన్ను చెల్లింపుదారులు ఎస్సెమ్మెస్ ద్వారా కూడా ఆధార్ - పాన్ అనుసంధానం చేసుకోవచ్చు. ఆదాయ పన్ను ఈ - ఫైలింగ్ వెబ్ సైట్ ద్వారా కూడా చేసుకునే వీలు ఉంది.

పాన్ కార్డు సమాచారంలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకునే సౌకర్యం కూడా కల్పించారు. పాన్ కార్డు దరఖాస్తులు స్వీకరించే సేవా కేంద్రాల్లోనూ అనుసంధానం చేస్తారు.

అనుసంధానంపై కంగారు అవసరం లేదు

జులై 1, 2017 పాన్-ఆధార్ అనుసంధానానికి ఆఖరి రోజుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. అయితే జూలై 1 నుంచి అనుసంధానం అనేది తప్పనిసరి. కానీ జులై ఒకటి డెడ్‌లైన్ అనేది నిజం కాదు. చాలామంది అనుకుంటున్నట్లు జూలై 1 లోపు అనుసంధానం చేయకపోతే పాన్‌కార్డు చెల్లదని కానీ, కొత్తది తీసుకోవాల్సి వస్తుందని కానీ కాదు.

ఈ విధమైన అపోహ వల్ల అందరూ ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ మీద దాడి చేయడంతో ఆ సైట్ కూడా కొన్నిసార్లు కుప్పకూలినట్లు సమాచారం. అలాంటి ఆందోళన అనవసరం. అయితే పాన్-ఆధార్ చేయకపోతే పాన్ కార్డు చెల్లకపోవడం అనేది కొంతమేరకు వాస్తవమే అయినప్పటికీ, అది ఇప్పట్లో కాదు.

ఇన్‌కంటాక్స్ యాక్ట్, సెక్షన్ 139ఎఎ ప్రకారం, 1 జులై, 2017 నాటికి పాన్ నంబర్ కేటాయించబడ్డ ప్రతీ వ్యక్తి, ఆధార్ నంబర్ పొందుటకు అర్హుడైన యెడల, తన ఆధార్ నంబరును సంబంధిత అధికారవర్గానికి ముందుగా తెలియజేయబడిన పద్ధతిలో, కేంద్ర ప్రభుత్వం తన అధికార రాజపత్రంలో ప్రకటించే తేదీ నాటికి తెలియపరచాలి.

లేదంటే ఆ వ్యక్తికి కేటాయించబడిన పాన్ నంబర్ రద్దు చేయబడి, అసలు పాన్‌కు దరఖాస్తు చేయనివారికి ఆ చట్టంలో పొందుపర్చిన ఏఏ షరతులు వర్తిస్తాయో, అవన్నీ వీరికీ వర్తిస్తాయి.

పైన తెలిపినదాని ప్రకారం, కేంద్రం ప్రకటించబోయే తేదీ నాటికి అనుసంధానం జరగకపోతే, పాన్ రద్దు చేయబడుతుంది. ఇంకా తేదీని ప్రకటించలేదు కాబట్టి, ఈ లోపున నిరాటంకంగా ఎప్పుడైనా ఈ ప్రక్రియను చేపట్టవచ్చు.

అనుసంధాన ప్రక్రియ కోసం...

ఆధార్-పాన్ లింక్ కోసం...

ఇందులో హోంపేజీలోనే అనుసంధానానికి సంబంధించిన లింక్ పైనే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా పాన్ కార్డ్‌కు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవచ్చును.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+