Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రిలయన్స్ టర్నోవర్ రూ.10,00,122 కోట్లు: షేర్ హోల్డర్లకు భారీ రివార్డులు: సంపదను పంచుతాం: అంబానీ

Reliance AGM Mukesh Ambani: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ.. కీలక ప్రకటన చేశారు. కంపెనీ షేర్ హోల్డర్లకు తీపికబురు వినిపించారు. వారికి బోనస్ షేర్లను ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సంస్థ పురోగతిలో వారిని భాగస్వామ్యులను చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం ముంబైలో ఏర్పాటైంది. 47వ సర్వసభ్య సమావేశం ఇది. ఇందులో ముఖేష్ అంబానీ మాట్లాడారు. సంస్థ ఉద్యోగులు, ప్రతినిధులు, షేర్ హోల్డర్లను ఉద్దేశించి కీలక ప్రకటనలు చేశారు. రిలయన్స్ జియో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ అంశాన్నీ ప్రస్తావించారు.

Reliance AGM 2024 We consider 1 1 bonus on Sept 5 says Mukesh Ambani

ఏడాదికేడాది రిలయన్స్ అద్భుత పురోగతిని సాధిస్తోందని ముఖేష్ అంబానీ అన్నారు. ఇందులో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలను తెలియజేస్తున్నానని చెప్పారు. ప్రత్యేకించి- షేర్ హోల్డర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ మధ్యాహ్నం 1:45 నిమిషాలకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపించామని ముఖేష్ అంబానీ తెలిపారు. బోనస్ షేర్లను జారీ చేయడానికి సెప్టెంబరు 5వ తేదీన ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ పురోభివృద్ధికి కారణమైన షేర్ హోల్డర్లకు రివార్డులను ఇవ్వనున్నామని, వారికి ప్రతిఫలాన్ని అందజేయాలనేదే తన అభిమతమని అంబానీ వ్యాఖ్యానించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది శాశ్వతంగా కొనసాగుతుందని పునరుద్ఘాటించారాయన.

Reliance AGM 2024 We consider 1 1 bonus on Sept 5 says Mukesh Ambani

స్వల్పకాలిక లాభాలను ఆర్జించడానికో లేక సంపదను కూడబెట్టుకోవడానికో తాము ఈ పారిశ్రామిక, వ్యాపార రంగంలో అడుగు పెట్టలేదని, దేశం సంపదను రెట్టింపు చేయాలనేదే తమ లక్ష్యమని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. ప్రతి భారతీయుడి జీవన శైలిని మరింత మెరుగుపర్చడానికి అహర్నిశలు కృషి చేస్తోన్నామని అన్నారు.

ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2023- 2024 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 10,00,122 కోట్ల రూపాయల రికార్డు టర్నోవర్‌ను నమోదు చేసింది. వార్షిక ఆదాయంలో 10 లక్షల కోట్ల రూపాయల మార్క్‌ను అధిగమించింది. అ ఘనత సాధించిన దేశ మొట్టమొదటి కంపెనీగా ఇదే.

రిలయన్స్ ఈబీఐటీడీఏ 1,78,677 కోట్ల రూపాయలు కాగా, నికర లాభం 79,020 కోట్ల రూపాయలు. మూడేళ్లలో కంపెనీ 5.28 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను పెట్టింది. 1,86,440 కోట్ల రూపాయలను వివిధ పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+