సంచలన ఆఫర్: రిలయన్స్ బిగ్ టీవీ.. ఏడాది పాటు ఫ్రీ!

న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్...టెలికాం విషయంలో బోల్తాపడినా డిజిటల్ టీవీ రంగంలో నిలదొక్కుకునేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులను పోగుచేసుకునేందుకు రిలయన్స్ జియో ఇచ్చిన మాదిరిగానే రిలయన్స్ డీటీహెచ్ 'బిగ్ టీవీ' కూడా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఉచిత చానెళ్లతోపాటు పెయిడ్ చానళ్లను కూడా ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ బిగ్ టీవీ ప్రకటించింది. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా విజన్‌లో భాగంగా దీనిని దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రవేశపెట్టింది. ఫలితంగా 130 కోట్ల మందికి హెచ్‌డీ నాణ్యత కలిగిన వినోద చానళ్లు అందనున్నాయి.

ఈరోజు నుంచి ఏడాదిపాటు ఫ్రీ...

ఈరోజు నుంచి ఏడాదిపాటు ఫ్రీ...

ఉచిత చానెళ్లతోపాటు పెయిడ్ చానళ్లను కూడా ఏడాది పాటు ఉచితంగా అందించే రిలయన్స్ బిగ్ టీవీ ఆఫర్‌కు సంబంధించిన హెచ్‌డీ హెచ్‌ఈవీసీ సెట్-టాప్ బాక్స్‌ ప్రీబుకింగ్ మార్చి 1న ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. దీనికోసం వినియోగదారులు ఒక్కో కనెక్షన్ కోసం రూ.499 ప్రీ బుకింగ్ చార్జీ కింద చెల్లించాల్సి ఉంటుంది. reliancedigitaltv.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ స్టాక్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది.

 500 చానళ్లు 5 ఏళ్లు ఉచితం...

500 చానళ్లు 5 ఏళ్లు ఉచితం...

రిలయన్స్ డిజిటల్ టీవీ డాట్ కాం‌లో ఈ ఆఫర్ కోసం ప్రీ బుక్ చేసుకున్న వినియోగదారుల ఇంటికి 30-45 రోజుల వ్యవధిలోగా సెట్‌టాప్ బాక్స్, అవుట్ డోర్ యూనిట్ అందుతాయి. అవి అందాక రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌స్టలేషన్ చార్జీల కింద మరో రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఆపైన ఫ్రీ టు ఎయిర్ చానళ్లతోపాటు పెయిడ్ చానళ్లను హెచ్‌డీ చానళ్ల సహితంగా ఏడాదిపాటు ఉచితంగా వీక్షించవచ్చు. అంతేకాకుండా ఈ 500 ఫ్రీ టు ఎయిర్ చానళ్లను ఐదేళ్లపాటు ఉచితంగా చూడొచ్చు.

 ప్రతి నెలా రూ.300తో రీచార్జీ చేసుకుంటే...

ప్రతి నెలా రూ.300తో రీచార్జీ చేసుకుంటే...

ఈ ఆఫర్‌లో భాగంగా రెండో ఏడాది నుంచి ప్రతినెలా రూ.300తో రీచార్జీ చేయించుకుంటేనే పెయిడ్ చానళ్లు చూడగలుగుతారు. ఇలా నెలకు రూ.300 చొప్పున కనీసం ఆర్నెల్లకు లెక్కేస్తేనే రూ.1800 అవుతుంది. ఇప్పుడు సాధారణంగా అన్ని ఇతర డీటీహెచ్ కంపెనీలు ఈ ఖర్చుకు ఏడాదిపాటు సేవలు అందిస్తున్నాయి. మరి రిలయన్స్ బిగ్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? అంటే ఇలా రెండేళ్లు రీచార్జీ చేయించుకుంటే... ఆ రెండేళ్లు పూర్తైయిన తరువాత బుకింగ్, ఇన్‌స్టాల్ చేసే సమయంలో చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని రిలయన్స్ బిగ్ టీవీ వివరిస్తోంది.

రీచార్జీల రూపంలో ప్రయోజనాలు...

రీచార్జీల రూపంలో ప్రయోజనాలు...

రిలయన్స్ డిజిటల్ అందిస్తోన్న బిగ్ టీవీ డీటీహెచ్ సేవలు ఉపయోగించుకునే వారికి లాయల్టీ ప్రయోజనాలను కల్పించనుంది. మొదట్లో ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్నప్పుడు, సెట్‌టాప్ బాక్స్ కొన్నప్పుడు అందుకున్న రసీదులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రసీదులు ఉన్న వినియోగదారులకు దాదాపు రూ.1999 విలువ చేసే రీచార్జీ కూపన్లను అందజేస్తారు.

 బోలెడు ప్రయోజనాలు...

బోలెడు ప్రయోజనాలు...

రిలయన్స్ బిగ్ టీవీ అందిస్తోన్న ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుంది. ప్రీ బుక్ చేసుకున్న 30-45 రోజుల మధ్యలో మీకు పరికరాలన్నీ అందుతాయి. బిగ్ టీవీ అందించే సెట్‌టాప్ బాక్స్‌ ద్వారా ఆయా చానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాలను వినియోగదారులు రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ సెట్‌టాప్ బాక్స్‌కు యూఎస్‌బీ సదుపాయం కూడా ఉంటుంది. యూట్యూబ్ వీడియోలను కూడా టీవీలో చూడొచ్చు. ఒకవైపు రికార్డింగ్ చేసుకుంటూనే మరోవైపు ఇతర చానల్‌ను వీక్షించే సదుపాయం ఉంది. మరిన్ని వివరాలకు కంపెనీ వెబ్‌సైట్ రిలయన్స్ డిజిటల్ టీవీ డాట్ కాం ను సందర్శించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+