Reliance: జనవరి 22న సెలవు ప్రకటించిన రిలయన్స్..
అయోధ్యలో రామమందిర ప్రారంభం కోసం యావత్ భారతావాణి ఎదురు చూస్తోంది. అయితే సోమవారం బాల రాముడికి ప్రాణ ప్రతిష్థ జరగనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆ రోజు ఆఫ్ డే లీవ్ ప్రకటించారు. అలాగే పలు రాష్ట్రాలు కూడా ఆ రోజు ఆఫ్ డే లీవ్ ప్రకటించాయి. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, త్రిపుర, ఓడిశా, గుజరాత్, అసోం రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సగం రోజు సెలవు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. తాజాగా దేశంలోని నెంబర్ వన్ ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ తమ సంస్థకు సెలవు ఇవ్వనున్నట్లు తెలిపారు.
జనవరి 22వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని నడుస్తున్న అన్ని కంపెనీల్లోని ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ అద్భుత ఘట్టాన్ని చూడటం కోసం.. ఈ అద్భుత కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీలకు సెలవు ప్రకటించినట్లు అంబానీ వెల్లడించారు.

దీంతో జనవరి 22వ తేదీన తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ షోరూంలు, ఇతర రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు మూతపడనున్నాయి. ఇక ముఖేష్ అంబానీ అయితే ఆ రోజు అయోధ్యలో జరిగే కార్యక్రమంలో స్వయంగా ఫ్యామిలీతో పాల్గొనున్నారు. అయితే జనవరి 22న బ్యాంకులు పని చేస్తాయా లేదా.. బ్యాంకులు ఉంటాయా లేదా.. బ్యాంకులకు సెలవు ఉందా లేదా.. ఉంటే సగం రోజు ఉంటుందా.. మధ్యాహ్నం నుంచి బ్యాంకులు ఓపెన్ అవుతాయా చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై బ్యాంకులు కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఆఫీసులు పని చేయనున్నాయి. వారు ఇళ్ల దగ్గర అయోధ్యలోని రాములోరి విగ్రహ ప్రతిష్ట చూసి.. భోజనాలు చేసి ఆఫీసులకు రానున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications