జియో సర్‌ప్రైజింగ్ ఆఫర్.. రూ.49కే అపరిమిత కాల్స్, 1జీబీ ఫ్రీ డేటా
రిలయన్స్ జియో.. గణతంత్ర దినోత్సవం సందర్బంగా గురువారం మరో ‘సర్‌ప్రైజింగ్ ఆఫర్’ ప్రకటించింది. డేటా పరిమితంగా వాడుకుంటూ కేవలం కాల్స్ మీద మాత్రమే ఆధారపడే కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చేసింది.
ముంబై: టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ ప్రత్యర్థి నెట్‌వర్క్‌లకు చుక్కలు చూపిస్తున్న జియో.. గణతంత్ర దినోత్సవం సందర్బంగా మరో 'సర్‌ప్రైజింగ్ ఆఫర్' ప్రకటించింది.
డేటా పరిమితంగా వాడుకుంటూ కేవలం కాల్స్ మీద మాత్రమే ఆధారపడే కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చేసింది. ఈ ఆఫర్ కింద కేవలం రూ.49లతో రీఛార్జి చేసుకుంటే.. ఏ నెట్‌వర్క్‌కు అయినా 28 రోజులపాటు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

అంతేకాదు, దీనికి అదనంగా 1 జిబీ డేటా ఉచితంగా లభిస్తోంది. ప్రస్తుతం జియో 4జి ఫీచర్ మొబైల్ వాడుతున్న వినియోగదారులతో పాటు కొత్తగా 1500 రూపాయలతో ఫీచర్ మొబైల్ కొన్న వినియోగదారులందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తమ వినియోగదారుల కోసం ఈ ఆఫర్ గురువారం నుంచి మూడేళ్ళ పాటు అందుబాటులో ఉంచనుంది జియో నెట్‌వర్క్. డేటాను పెద్దగా వాడని వారు, కేవలం కాల్స్ మాత్రమే చేసుకునే వారికి ఇది అద్భుతమైన ఆఫరే.












Click it and Unblock the Notifications