అలాంటి 'సిమ్'లను రిలయన్స్ బ్లాక్ చేయనుంది: ఎస్ఎంఎస్ ద్వారా హెచ్చరిక!
త్వరలోనే చాలావరకు నాన్ వెరిఫైడ్ సిమ్ లపై జియో నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది.
న్యూఢిల్లీ: ధ్రువీకరించని సిమ్ కార్డులను బ్లాక్ చేసేందుకు రిలయన్స్ జియో నెట్ వర్క్ సిద్దమవుతోంది. సిమ్ కార్డు తీసుకునే సమయంలో కస్టమర్లు ఆధార్ కార్డులను సమర్పిస్తున్నప్పటికీ.. అన్ వెరిఫైడ్ సిమ్ లను బ్లాక్ చేయనుంది.
దీంతో పాటు ఇ-కేవైసీ సమర్పించని ఖాతాదారులను ఎస్ఎంఎస్ ల ద్వారా జియో హెచ్చరిస్తోంది. లేనిపక్షంలో ప్రస్తుతం వాడుతున్న జియో సిమ్ నుంచి 1977 అనే నంబర్ కు డయల్ చేసి టెలీ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచిస్తోంది.

త్వరలోనే చాలావరకు అన్ వెరిఫైడ్ సిమ్ లపై జియో నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. కాగా, లోకల్ ఆధార్ కార్డుతో జియో సిమ్ తీసుకున్నవారికి ఎలాంటి సమస్య ఉండకపోగా, నాన్ లోకల్స్ మాత్రం టెలీ వెరిఫికేషన్ చేసుకోవాల్సిందే. ఏప్రిల్ 1నుంచి టెలి వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు కొంతమంది యూజర్లకు ఎస్ఎంఎస్ లు పంపించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications