జియో సరికొత్త నిర్ణయం: ఇకనుంచి '6' సిరీస్ నంబర్స్..
రాజస్థాన్ లో60010-60019 ఎంఎస్సీ(మొబైల్ స్విచ్చింగ్ కోడ్), అసోం-60020 - 60029, తమిళనాడు-60030 - 60039 ఎంఎస్సీలో ఎంఎస్సీలో కనెక్షన్లను జారీ చేయనున్నట్టు సంస్థ తెలిపింది.
ముంబై: టెలికాం కంపెనీలకు షాకిస్తూ 'జియో' ఎంట్రీతో కస్టమర్లందరిని తనవైపుకు తిప్పుకున్న రిలయన్స్ మరిన్ని ఆసక్తికర నిర్ణయాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటిదాకా రిలయన్స్ జియో కస్లమర్స్ అందరికి 7,8,9 సిరీస్ లను మాత్రమే కేటాయిస్తూ వచ్చిన జియో.. మరికొద్దిరోజుల్లో కొత్త సిరీస్ ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
రిలయన్స్ జియోలో కొత్తగా చేరే కస్టమర్స్ కు '6'సిరీస్ తో మొదలయ్యే నంబర్స్ ను కేటాయించనున్నారు.రిలయన్స్ '6'సిరీస్ ప్రతిపాదనకు టెలికాం శాఖ కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే తొలిదశలో కొన్ని సర్కిల్స్ లో మాత్రమే ఈ '6'సిరీస్ నంబర్లు అందుబాటులోకి రానున్నాయి.

రాజస్థాన్, తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో తొలుత ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. రాజస్థాన్ లో60010-60019 ఎంఎస్సీ(మొబైల్ స్విచ్చింగ్ కోడ్), అసోం-60020 - 60029, తమిళనాడు-60030 - 60039 ఎంఎస్సీలో ఎంఎస్సీలో కనెక్షన్లను జారీ చేయనున్నట్టు సంస్థ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు ఇప్పట్లో ఈ '6'సిరీస్ నంబర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.
కాగా, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు '7' సిరీస్‌ను, కోల్‌కత్తా, మహారాష్ట్రకు '8' సిరీస్‌లోనూ జియో నంబర్లను కేటాయించనుంది రిలయన్స్.












Click it and Unblock the Notifications