నంబర్ మార్చకుండా.. రిలయన్స్ జియోకు మారడమెలాగో తెలుసా?

న్యూఢిల్లీ : టెలికాం రంగంలో.. జియో సృష్టించిన సంచలనంతో.. కస్టమర్లంతా రిలయన్స్ స్టోర్స్ వైపు క్యూ కట్టారు. ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత రోమింగ్ తో పాటు రూ.50 కే అత్యంత చౌకగా 1జీబీ డేటాను రిలయన్స్ అందిస్తుండడంతో.. జియో సిమ్ ను సొంతం చేసుకోవాలనే ఆతృత ప్రతీ ఒక్కరిలో మొదలయింది.

సెప్టెంబర్ 5 నుంచి రిలయన్స్ స్టోర్స్ తో పాటు, ప్రముఖ ప్రైవేట్ షోరూంల్లో కూడా జియో సిమ్ లు అందుబాటులోకి వస్తాయని సంస్థ ప్రకటించడంతో.. ఎప్పుడెప్పుడు సిమ్ ను సొంతం చేసుకుంటామా అన్న కుతూహలంతో ఉన్నారు చాలామంది కస్టమర్లు. అయితే కొత్త సిమ్ తీసుకుంటే.. పాత నంబర్ సంగతేంటి.. ఉన్న నంబర్ పైనే కొత్త సిమ్ ఇస్తే ఎంత బాగుండు అని ఆలోచిస్తున్నవారికి ఇప్పుడో గుడ్ న్యూస్.

ప్రస్తుతం కస్టమర్లు వినియోగిస్తున్న నంబర్ నుంచే.. పోర్ట్ ఆప్షన్ ద్వారా రిలయన్స్ జియోకు మారే వెసులుబాటును రిలయన్స్ అందిస్తోంది.

Reliance Jio MNP: How to Switch to Jio Without Losing Your Number

ఇదిగో.. ఈ ప్రాసెస్ ను ఫాలో అవండి :

1) ఇందుకోసం.. ముందుగా మీ నంబర్ నుంచి 'పోర్ట్' అని టెక్ట్స్ మెసేజ్ టైప్ చేసి 1900 సర్వీస్ నెంబర్ కు పంపించాలి. తద్వారా మీరు పంపించిన మెసేజ్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెలికాం కంపెనీకి చేరుతుంది. అయితే 4జీ ని సపోర్ట్ చేసే హ్యాండ్ సెట్స్ లొ మాత్రమే పోర్ట్ ఆప్షన్ ఎంచుకునే వెసులుబాటు ఉంది.

2) మై జియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం ఆఫర్ కోడ్ ఎంటర్ చేయాలి.

3)సమీపంలోని రిలయన్స్ స్టోర్ ను సంప్రదించాలి. హ్యాండ్ సెట్ తీసుకెళ్లడంతో పాటు పోర్ట్ అవుట్ కోడ్ ను, ఫ్రీ వెల్ కమ్ ఆఫర్ కోడ్ వంటి వివరాలతో స్టోర్ లో సంప్రదించాలి.

4) సరైన అడ్రస్ ప్రూఫ్ ను, ఆధార్ కార్డును జతచేసిన రిలయన్స్ స్టోర్ లో సమర్పించాలి.

5) ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక.. వారం రోజుల తర్వాత జియో సిమ్ యాక్టివేట్ అవుతుంది. ఆ వెంటనే.. రూ.19 ఛార్జీ అయినట్లుగా ఓ మెసేజ్ కూడా వస్తుంది. సిమ్ పోర్ట్ యాక్టివేషన్ సమయంలో రెండు గంటల పాటు సిమ్ సేవలు నిలిచిపోతాయి.

6) యాక్టివేషన్ తర్వాత ప్రస్తుతం వినియోగిస్తున్న సిమ్ సేవలు అప్పటితో నిలిచిపోయాయి. నో సర్వీస్ మెసేజ్ అని మొబైల్ లో కనిపిస్తుంది. కొత్తగా వచ్చిన జియో సిమ్ ను ఆ పాత సిమ్ స్థానంలో రీప్లేస్ చేసేయాలి.

7) అనంతరం కొద్ది గంటల్లోనే జియో నెట్ వర్క్ సేవలు అందుబాటులోకి వస్తాయి. నేరుగా జియో సిమ్ తీసుకున్నవాళ్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయో పోర్ట్ ద్వారా జియో సిమ్ తీసుకున్న కస్టమర్లకు కూడా అవే ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి.

8) అయితే ఇందుకు ఓ ఖచ్చితమైన నిబంధన ఉంది. ఏ సిమ్ నుంచి పోర్ట్ అవాలనుకుంటున్నారో.. ఆ సిమ్ ను కనీసం 90 రోజుల పాటు వాడి ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+