రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ : 15 నెలల పాటు సర్వం ఫ్రీ..
న్యూఢిల్లీ : ఇప్పటికే ఉచిత డేటా, ఉచిత రోమింగ్ అంటూ జియో ఎంట్రీ ద్వారా మిగతా టెలికాం సంస్థలను కుదేలు చేసిన రిలయెన్స్.. తాజాగా ఆపిల్ ఫోన్ వినియోగదారులకు మరో బంపర్ బొనాంజా ప్రకటించింది. ఆపిల్ వినియోగదారులందరికీ 15నెలల పాటు ఉచిత సర్వీసులు అందించినున్నట్లు తెలిపింది. దీంతో నెలకు రూ. 1,499 రీచార్జ్ తో లభించే సర్వీసును ఇప్పుడు పూర్తి ఉచితంగా పొందనున్నారు రిలయెన్స్ జియో ఆపిల్ వినియోగదారులు.

ప్రస్తుతం రిలయెన్స్ అందిస్తోన్న వెల్ కమ్ ఆఫర్ తో ఒక నెలపాటు ఉచిత సర్వీసులు పొందుతున్న వినియోగదారులు.. తాజా రిలయెన్స్ ప్రకటనతో 15 నెలల ఉచిత సర్వీసులు పొందనున్నారు. అయితే ఈ ఆఫర్ జనవరి 17నుంచి అందుబాటులోకి వస్తుంది. కాగా, రిలయెన్స్ వెల్ కమ్ ఆఫర్ డిసెంబర్ 31వ తేదీకి గడువు ముగియనుంది. ఆ తర్వాత జనవరిలో ఈ కొత్త ఆఫర్ ఆపిల్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.












Click it and Unblock the Notifications