షాక్: కస్ఠమర్ల డేటా లీక్, అబ్బే అలాంటిదేమీ లేదన్న జియో

రిలయన్స్‌జియో కస్టమర్ల డేటా ఆన్‌లైన్‌లో లీకైందనే వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందనే వార్త జోరుగా విన్పిస్తోంది.అయితే ఈ వార్తలను జియో తీవ్రంగా ఖండించింది.

ముంబై:రిలయన్స్‌జియో కస్టమర్ల డేటా ఆన్‌లైన్‌లో లీకైందనే వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందనే వార్త జోరుగా విన్పిస్తోంది.అయితే ఈ వార్తలను జియో తీవ్రంగా ఖండించింది.

లక్షలకొద్దీ రిలయన్స్ జియో కస్టమర్ల వ్యక్తిగా సమాచారం ఆన్‌లైన్‌లో మాజిక్ ఏపీకే.కామ్ అనే వెబ్‌సైట్‌లో లీకైందనే కథనాలు వచ్చాయి. సంబంధిత వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను కొంతమంది ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Reliance Jio Says No Customer Database Breach After Alleged Data Dump

జియో కస్టమర్ల ఫోన్ నెంబర్లు ఈ మెయిల్ తదితర సమాచారం ఈ సైట్‌లో దర్శనమిస్తున్నాయని ట్వీట్ చేయడంతో దుమారం రేగింది. డేటాబేస్ ఉల్లంఘన ఏ మేరకు ఉంది అనేది మాత్రం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.

అయితే ఈ వార్తను జియో తీవ్రంగా ఖండించింది. వదంతులను నమ్మవద్దని కోరింది. తమ వినియోగదారుల డేటా సురక్షితంగా ఉందని గట్టిగా వాదిస్తోంది. ఎలాంటి డేటా లీక్ కాలేదని జియో ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. తమ కస్టమర్ల డేటా భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన అనంతరం డేటాలీక్ అనేది అవాస్తవమని, నిరాధరమైందని జియో ప్రకటించింది. దీనిపై మరింత విచారణ కొనసాగుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+