జియో ప్రైమ్‌ యూజర్లకు మరో బంపర్‌ ఆఫర్‌

రిలయన్స్‌ జియో తన ప్రైమ్‌ ఖాతాదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రిలయన్స్ జియో భాగస్వామ్యంతో ఆసుస్ ఫోన్లను కొత్తగా కొన్న యూజర్లకు అడిషనల్‌ డేటా పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చింది.

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో తన ప్రైమ్‌ ఖాతాదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రిలయన్స్ జియో భాగస్వామ్యంతో ఆసుస్ ఫోన్లను కొత్తగా కొన్న యూజర్లకు అడిషనల్‌ డేటా పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చింది.

తాజా ప్లాన్‌ ప్రకారం... 10 రీఛార్జ్ లపై నెలకు 10 జీబీ అదనపు డేటాను పొందవచ్చు. జూన్ 16, 2017, లేదా ఆ తరువాత అసుస్ స్మార్ట్‌ఫోన్లను కొన్న వారికి ఈ ఆఫర్ వర్తించనుంది.

Reliance Jio users can get up to 100GB free 4G data on buying Asus smartphones

వీరికి 10 నెలల పాటు నెలకు 10 జీబీ జియో 4జీ డేటా చొప్పున మొత్తం 100 జీబీ డేటా ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది. మూడు కేటగిరీలుగా ఈ ఉచిత డేటాను ఆఫర్‌ చేస్తోంది. ఆసుస్‌ స్మార్ట్‌ఫోన్‌లో జియో సిమ్‌ను వేసి రూ.309 ఆపైన ప్యాక్‌ను రీచార్జి చేసుకుంటే చాలు.

రోజుకు 1జీబీ డేటాతోపాటుగా నెలకు 10 జీబీ డేటా లభించనుంది. క్రెడిట్ పొందడానికి రీఛార్జి తరువాత వినియోగదారులకు 48 గంటలు వేచి చేయాలి. పది నెలలకు అంటే.. మార్చి 31, 2018 వరకు గరిష్టంగా 10 రీచార్జిలకు ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చన్నమాట.

ఆసుస్ జెన్‌ఫోన్ జూమ్, జెన్‌ఫోన్ 3 డీలక్స్, జెన్‌ఫోన్ 3 అల్ట్రా, జెన్‌ఫోన్ 3 (5.2), జెన్‌ఫోన్ 3 (5.5) ఫోన్లను వాడే వారికి నెలకు 10 జీబీ డేటా చొప్పున 10 నెలలకు 100 జీబీ జియో 4జీ డేటా ఉచితంగా లభిస్తున్నది.

అదేవిధంగా జెన్‌ఫోన్ 2, జెన్‌ఫోన్ 2 లేజర్, జెన్‌ఫోన్ 2 లేజర్ 5.5, జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్, జెన్‌ఫోన్ 3 లేజర్, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.2, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.5 ఫోన్లను వాడుతున్న యూజర్లకు నెలకు 5జీబీ డేటా చొప్పున 10 నెలలకు 50 జీబీ డేటా లభిస్తుంది.

ఇక జెన్‌ఫోన్ సెల్ఫీ, జెన్‌ఫోన్ మ్యాక్స్, జెన్‌ఫోన్ లైవ్, జెన్‌ఫోన్ గో 4.5 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్ గో 5.0 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్ గో 5.5 ఎల్‌టీఈ ఫోన్లను వాడుతున్న వారికి నెలకు 3 జీబీ డేటా చొప్పున 10 నెలలకు 30 జీబీ డేటా ఉచితం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+