రాఫెల్ రచ్చ: ఎన్డీటీవీ పై పరువునష్టం దావా వేసిన రిలయన్స్ గ్రూప్
అహ్మదాబాద్ : రాఫెల్ ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తోంది. రాఫెల్ పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని బట్టబయలు చేస్తూ ప్రముఖ జాతీయ మీడియా ఎన్డీటీవీ కథనం ప్రసారం చేసింది. ఇందులో అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ గ్రూపునకు సంబంధం ఉందంటూ కథనాలు ప్రసారం చేసింది. దీంతో అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ గ్రూపు రూ.10వేల కోట్లు పరువు నష్ట దావా వేసింది. రాఫెల్ డీల్‌కు సంబంధించి అవాస్తవాలను, కట్టుకథలను ప్రసారం చేసిందని ఆరోపిస్తూ గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టులో రిలయన్స్ గ్రూపు పదివేల కోట్ల రూపాయలకు దావా వేసింది. అక్టోబరు 26న దీనిపై విచారణ జరగనుంది. ఎన్‌టీవీలో సెప్టెంబరు 29 న ప్రసారం చేసిన వీక్లీ ప్రోగ్రాం 'ట్రూత్ వెర్సస్ హైప్స్'పై ఈ కేసు ఫైల్ చేసింది.
రిలయన్స్ గ్రూప్ వేసిన దావాపై ఎన్డీ టీవీ స్పందించింది. తాము ఎట్టి పరిస్థితుల్లో బెదిరేది లేదని తెలిపింది. న్యాయపోరాటానికి ఎన్డీటీవీ సిద్ధమని ప్రకటించింది. రిలయన్స్ ఆరోపణలను కొట్టిపారేసింది. ఆరోపణల్లో వాస్తవం లేదని ఎన్డీటీవీ వెల్లడించింది. ఒక వార్తా సంస్థగా సత్యాన్ని బయటపెట్టే బాధ్యత తమకుందనీ, స్వతంత్ర, న్యాయమైన జర్నలిజానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. అంతేకాదు ఇది మీడియాకు ఒక హెచ్చరిక అని ఎన్‌డీటీవీ వ్యాఖ్యానించింది.

ఇక షో ఆన్ఎయిర్‌లోకి రాక కొద్దిరోజుల ముందే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకాయిస్ హోలాండే కేంద్ర ప్రభుత్వమే ఆఫ్‌సెట్ భాగస్వామిగా రిలయన్స్‌ను సూచించిందని చెప్పడంతో మరింత అగ్గి రాజేసింది. ఒప్పందం జరిగిన సమయంలో హోలాండేనే అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో రాఫెల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం జోరుగా సాగుతోంది. దివాలా తీసిన అనిల్ అంబానీకి బిల్లియన్ల డాలర్లను కట్టబెట్టేందుకే ప్రభుత్వరంగ సంస్థను కాదని మరీ రిలయన్స్ డిఫెన్స్‌కు ఈ కాంట్రాక్టును అప్పగించిందని నరేంద్రమోదీ సర్కార్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. దేశానికి కాపలాదారుడిగా ఉంటానని చెప్పిన ప్రధాని మోడీ.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications