‘డాన్’కు క్లీన్‌చిట్: సోమనాథ్ భారతికి బెయిల్
న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే, న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతి పెంపుడు కుక్క ‘డాన్'కు ఢిల్లీ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. భారతిపై ఆయన భార్య లిపికామిత్ర గృహహింస కేసు పెట్టంతో ఆయనను పోలీసులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే.
భారతి పెంచుకొంటున్న లాబ్రాడార్ శునకంతో తనను కరిపించారని లిపికామిత్ర ఆరోపించటంతో జంతువైద్యుల పర్యవేక్షణలో ఆ శునకాన్ని పరీక్షించారు. అయితే, ఇతరులను కరువాలని సోమ్‌నాథ్ భారతి ఇచ్చిన ఆదేశాలకు డాన్ స్పందించలేదు. దీంతో లిపికామిత్ర ఆరోపణలను కొట్టివేస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి అనిల్‌కుమార్ బుధవారం డాన్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు.
సోమనాథ్ భారతికి బెయిల్

గృహ హింస, హత్యాయత్నం కేసుల్లో అరెస్టయిన ఆప్ ఎమ్మెల్యే మంత్రి సోమ్‌నాథ్ భారతికి బెయిల్ మంజూరైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ సిటీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.
లక్ష రూపాయల వ్యక్తిగత పూచికత్తును సమర్పించాలని, విచారణ పూర్తయ్యేంత వరకు దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం ఆదేశించింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications