అమెరికాలో అరెస్టైన విద్యార్థుల‌కు ఉప‌శ‌మ‌నం..! ఆ గ‌డువులోపు స్వ‌దేశాల‌కు వెళ్లి పోవ‌చ్చ‌న్న కోర్ట్..

హోం లాండ్ / హైద‌రాబాద్ : న‌కిలీ యూనివ‌ర్సిటీ ఉచ్చులో ఇరుక్కుని జైలు పాలైన తెలుగు విద్యార్థుల ప‌ట్ల అక్క‌డి న్యాయ స్థానం అనుకూలంగా స్పందించింది. ఫార్మింగటన్ ఫేక్ యూనివర్శిటీ కేసులో అరెస్ట్ అయిన 16 మంది విద్యార్థులకు కోర్టులో ఊరట కలిగింది. ఫిబ్రవరి 26 లోగా స్వచ్ఛందంగా స్వదేశాలకువెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. 20 మందిలో ముందుగానే వాలంటరీ డిపార్చర్(స్వచ్ఛందంగా స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు) అనుమతి పొందిన ముగ్గురు విద్యార్థులు(ఇద్దరు ఇండియన్స్, ఒక పాలస్తీనియన్) ఉన్నారు. మిగిలిన 17 మందిపై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసు ఫైనల్ హియరింగ్ 12 ఫిబ్రవరి 2019 జరిగింది. కేలహోన్ కౌంటీ జైళులోని 12 మంది, మన్రో కౌంటీ జైళులోని 8 మంది మొత్తం 20 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. 17 మందిలో 15 మందికి వాలంటరీ డిపార్చుయర్ కు కోర్టు అవకాశం కల్పించింది. 15 మందిలో 8 మంది తెలుగు విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం.

16 వ విద్యార్థికి కూడా తిరిగి వెళ్లిపోయే అవకాశం కల్పించింది కానీ స్వచ్చందంగా కాకుండా యూఎస్ గవర్నమెంట్ రిమూవల్ క్రింద వెళ్లేందుకు అనుమతి లభించింది. 17 వ విద్యార్థి యూఎస్ సిటిజన్ ను పెళ్లి చేసుకున్నాడు అందుకు అతను బేయిల్ బాండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 16 మంది విద్యార్థులు కోర్టు జడ్జిమెంట్ మేరకు వాలంటరీగా, ఫిబ్రవరీ 26 లోపు యూఎస్ వదిలివెళ్లాల్సి ఉంటుంది.

Relief to students arrested in America..! The court said they may go home country with in that period .. !!

విద్యార్థులు కూడా తిరుగు ప్రయాణానికి సిద్దమవుతున్నారు. విద్యార్థులు తిరుగు పయనమయ్యేందుకు టికెట్ల బుకింగ్ టైమింగ్.. జైళు ఇమిగ్రేషన్ అధికారులకి విద్యార్థులు ముందే తెలియపరచాల్సి ఉంటుంది. ఆ మేరకు జైళు ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను జైళు నుంచి ఏయిర్ పోర్టుకు చేర్చే ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్ర‌క్రియ కొంత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉన్నా స‌కాలంలో స్వ‌దేశాల‌కు వ‌చ్చేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+