రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం, విజయకాంత్‌కు చిక్కులు

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పైన డిఎండికె అధ్యక్షుడు విజయకాంత్ నోరు పారేసుకోవడం అతనికి చిక్కులు తెచ్చి పెట్టింది. పలుచోట్ల రజనీ అభిమానులు విజయకాంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉత్తర చెన్నైలోని కొడుంగయ్యూరులో గల మీనంబల్ నగర్‌లోను కెప్టెన్ దిష్టిబొమ్మను దగ్థం చేశారు.

రజనీకాంత్ కావాలనుకుంటే ప్రధానమంత్రి కూడా కాగలరని, అంతటి ప్రజాభిమానాన్ని రజనీకాంత్ పొందుతున్నారని, రజనీ ఆధ్యాత్మికం వైపు వెళ్తున్నారని, అలాంటి వ్యక్తి పట్ల విజయకాంత్ నోరు పారేసుకోవడం సరికాదని, సూపర్ స్టార్ పట్ల ఆయన తీరు సరికాదని, ఎన్నికల ప్రచారం కోసం సూపర్ స్టార్‌ను ఉపయోగించుకవద్దని ఓ రజనీ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.

Vijaykanth

తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన పార్టీకి, ఆయన కూటమికి ఇబ్బందికరమైనవేనని అంటున్నారు. రజనీ అభిమానులు ఆయన కూటమికి దూరం జరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. విజయకాంత్ వ్యాఖ్యలు రజనీకాంత్ అభిమానులను తీవ్రంగా బాధించాయి.

కాగా, విజయకాంత్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ... రజనీకాంత్ మాదిరిగా తాను పిరికివాడిని కాదన్నారు. రాజకీయ నాయకులు భయపెడితే భయపడడానికి తాను రజనీకాంత్ మాదిరిగా తాను పిరికివాడిని కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+