ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ కన్నుమూత: ప్రధాని దిగ్భ్రాంతి
అహ్మదాబాద్: ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ దరువల్ల(90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దరువల్లాకు ఇద్దరు కుమారులు నస్తుర్, ఫర్దూన్, ఒక కూతురు నజ్రీన్ ఉన్నారు.
నిమోనియా లక్షణాలతో వారం రోజుల క్రితం దరువల్ల ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించారు. అయితే, కరోనా లేదని పరీక్షల్లో తేలింది.

నిమోనియాతోపాటు మెదడకు తగిన మొత్తంలో ఆక్సిజన్ అందని కారణంగానే బెజన్ దరువల్ల మృతి చెందారని అతని కుమారుడు నస్తుర్ తెలిపారు. జులై 11, 1931లో ఆయన ఒక పార్శీ కుటుంబంలో జన్మించారు. కాగా, గత వెయ్యేళ్లలో పుట్టిన 100 మంది గొప్ప జ్యోతిష్కుల్లో బెజన్ ఒకరని ది మిలినీయం బుక్ ఆఫ్ ప్రొఫెసీలో హార్పర్ కొలిన్స్ వెల్లడించారు.
అటల్ బీహారీ వాజపేయి, మొరార్జీ దేశాయ్ లాంటి వారు దేశ ప్రధాని అవుతారని బెజన్ ముందే చెప్పడం గమనార్హం. నరేంద్ర మోడీ కూడా ప్రధాని అవుతారని ఈయన ముందే చెప్పారు. రాజీవ్ గాంధీ హత్య, సంజయ్ గాంధీ ప్రమాదం, భోపాల్ విషాదం లాంటి ఘటనలను కూడా ఆయన ముందె చెప్పడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీపాటు పలువురు రాజకీయ నాయకులతోనూ ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది.
కాగా, బెజన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన ప్రజాసేవ కోసమే జీవించారన్నారు. పేదల జీవితాల్లో వెలుగునింపారన్నారు. బెజన్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా బెజన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు .ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Shri Ajit Jogi Ji was passionate about public service. This passion made him work hard as a bureaucrat and as a political leader. He strived to bring a positive change in the lives of the poor, especially tribal communities. Saddened by his demise. Condolences to his family. RIP.
— Narendra Modi (@narendramodi) May 29, 2020
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications