ముంబైలో ఆ ఇంటి అద్దె కేవలం 64 రూపాయలే...కానీ అందులో ఎవరూ చేరడం లేదు ఎందుకని..?

ముంబై: అది దక్షిణ ముంబైలోని తర్ధే ప్రాంతం. అక్కడ ఇళ్లు అద్దెకు దొరకడమంటే గగనమే. అక్కడ చదరపు అడుగు స్థలం రూ.60వేలు అంటే అక్కడ ఇళ్లుల అద్దె ఏ రేంజ్‌లో ఉంటాయో అంచనా వేయొచ్చు. కానీ అదే ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ మాత్రం చాలా తక్కువ అద్దెకే లభిస్తోంది. నెలకు కేవలం రూ.64 అద్దె చెల్లించి ఆ ఫ్లాట్‌ను తీసుకోవచ్చు. కానీ గత 11 ఏళ్లుగా ఆ ఫ్లాట్‌లోకి ఎవరూ రావడం లేదు. ఓ ట్రస్టు ఏర్పాటు చేసిన నిబంధనలతో ఇక్కడి అద్దె అంత తక్కువగా ఉంది.

ఈ భవనాన్ని నిర్మించిన ఆర్‌డీ మహలక్ష్మీవాలా ఛారిటీ బిల్డింగ్‌ ట్రస్ట్‌ విధించిన ప్రత్యేక నిబంధనతో ఈ ఫ్లాట్‌ పదేళ్లకు పైగా ఖాళీగా ఉంది. 1940లో ఈ ట్రస్టు ముంబై పోలీసుతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇది పార్శీ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారికి మాత్రమే అద్దెకు ఇవ్వాలనేది ఒప్పందం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే సమస్య ఇక్కడే వచ్చింది. మొత్తం ముంబై పోలీసు సర్వీసులో పార్శీ సామాజిక వర్గానికి చెందినవారు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకరు ముంబై బయట నివాసం ఉంటుండగా మరొకరికి సొంత ఇళ్లు ఉంది.

Rent this Mumbai flat at Rs 64 per month, no joke but theres a catch

ముంబై నగర అభివృద్ధిలో పార్శీ సామాజిక వర్గాల వారిది కీలక పాత్ర ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు ముంబై పరిపాలనా విభాగంలో పోలీస్ విభాగంలో పార్శీ సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్య బాగానే ఉండేది. అయితే కాలక్రమంలో పార్శీల జనాభా తగ్గిపోతూ వస్తోంది. ఇక పార్శీ సామాజిక వర్గానికి చెందిన పోలీసులకే ఇల్లు అద్దెకు ఇవ్వాలనే నిబంధనను తొలగించేందుకు ముంబై పోలీస్ శాఖ ట్రస్టుతో చర్చలు జరుపుతోంది. ఇప్పటి వరకు ఆ గదిని తమకు కేటాయించాలని చాలామంది పోలీసు అధికారులు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ ఇల్లును ఖాళీగా ఉంచారు తప్పితే పార్శీ యేతర పోలీసు అధికారులకు ఇవ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+