పవన్‌లాంటి వాళ్లు కావాలి, మాకే తెలుసు: రేణు దేశాయ్

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రశంసల జల్లు కురిపించారు. చాలా వాస్తవ దృక్పథం కలిగిన వ్యక్తి అని, మానవత్వం కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక రేణు దేశాయ్ దాదాపు తొలిసారి స్పందించారు.

ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత తాను మొదటిసారి పవన్ కళ్యాణ్ పైన బహిరంగంగా స్పందిస్తున్నానని చెప్పారు. పవన్‌కు కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా ఉదారమైన, ఉదాత్తమైన, వినయపూర్వకమైన, నిష్కళంకమైన వ్యక్తి అని, ఆయన హృదయం నిష్కళంకమైనదని చెప్పారు.

 Renu Desai finally breaks her silence on Pawan

తామిద్దరు జీవితంలో ఏం జరిగిందో తమకు మాత్రమే తెలుసునని చెప్పారు. తమ ఇద్దరి జీవితంలో ఏం జరిగిందో ఇతరులెవరికీ తెలియదన్నారు. తామిద్దరి జీవితంపై కామెంట్ చేసే అర్హత ఈ ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు.

సొసైటీకి ఏదో చేయాలని మనస్ఫూర్తిగా, నిజాయితీగా తపించే పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా గౌరవమని, ఆయనను తాను ఆరాధిస్తానని రేణు దేశాయ్ అన్నారు. తాను అప్పుడు.. ఇప్పుడు... ఎప్పుడు.. పవన్‌కు మద్దతుగా ఉంటానని చెప్పారు. తాను పవన్‌కు ఎప్పుడు అండగా నిలబడ్డానని, ఇక ముందు మద్దతుగా ఉంటానన్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ప్రపంచానికి అవసరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+