Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రిపబ్లిక్ డే: విశేషంగా ఆకట్టుకున్న శకటాలివే, కానరాని తెలుగు శకటాలు

Recommended Video

    Republic Day celebrations : BSF మహిళా సైనికులు అద్భుత ప్రదర్శన

    న్యూఢిల్లీ: దేశరాజధానిలో శుక్రవారం 69వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ ప్రభుత్వ పథకాలతో పాటు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంస్కృతులను తెలియజేస్తూ శకటాలను ప్రదర్శించారు.

    ఆసియాన్‌ దేశాల విద్య, వైద్యం, సాంస్కృతిక వైవిధ్యాలపై ప్రదర్శించిన శకటాలు, ఆకాశ్‌, బ్రహ్మోస్‌ క్షిపణులకు సంబంధించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

     ప్రత్యేక ఆకర్షణగా..

    ప్రత్యేక ఆకర్షణగా..

    ఈ ప్రదర్శనలో మేక్‌ ఇన్‌ ఇండియా, ఖేలో ఇండియా, ఆదాయపన్ను శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖ, ఆల్‌ఇండియా రేడియా, సరిహద్దు దళాలు, ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు.

     సంస్కృతులను చాటుతూ..

    సంస్కృతులను చాటుతూ..

    సబర్మతి ఆశ్రమం థీమ్‌తో గుజరాత్‌, ఛత్రపతి శివాజీ థీమ్‌తో మహారాష్ట్ర, అడవిలో వన్యమృగాలకు సంబంధించిన థీమ్‌తో కర్ణాటక, చేతివృత్తుల థీమ్‌తో త్రిపుర, బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన థీమ్‌తో మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు శకటాలను ప్రదర్శించాయి.

    విశేషంగా ఆకట్టుకున్న బాలలు

    విశేషంగా ఆకట్టుకున్న బాలలు

    ఇతర రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు కూడా ఆకట్టుకున్నాయి. జాతీయ సాహస బాలల అవార్డులు అందుకున్న 18 మంది పిల్లలకు పరేడ్‌లో విశేష గౌరవం దక్కింది. వారు ప్రత్యేకమైన వాహనాల్లో పరేడ్‌లో పాల్గొన్నారు.

     కానరాని తెలుగు శకటాలు

    కానరాని తెలుగు శకటాలు

    కాగా, దాదాపు ప్రతిసారి వేడుకల్లో పాల్గొనే తెలుగు రాష్ట్రాలు ఈసారి శకటాలను ఈ వేడుకలకు పంపనట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల శకటాలు దర్శనమిచ్చినా మన తెలుగు రాష్ట్రాల శకటాలు మాత్రం ఎక్కడా కానరాలేదు.

     మహిళా బైకర్స్ విన్యాసాలు అదుర్స్

    మహిళా బైకర్స్ విన్యాసాలు అదుర్స్

    వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టకున్నాయి. కాగా, బీఎస్‌ఎఫ్‌కు చెందిన మహిళా బైకర్స్‌ బృందం ప్రదర్శించిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలిసారి చేసినా.. అద్భుతంగా చేశారంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+