సచివాలయంపైనుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు: ఏం జరిగిందంటే?

ముంబై: రిజర్వేషన్ల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర సచివాలయంపైనుంచి డిప్యూటీ స్పీకర్ తోపాటు అధికార కూటమి ఎమ్మెల్యేలు దూకడం సంచలనంగా మారింది. గిరిజన తెగకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో నిరసన తెలిపిన అజిత్ పవార్ వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా పలువురు ఎమ్మెల్యేలు సచివాలయం భవనంపైనుంచి కిందకు దూకారు.

అయితే, అప్పటికే అధికారులు సేఫ్టీ నెట్ ఏర్పాటు చేయడంతో అందులోనే వీరంతా పడిపోయారు దీంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. వెంటనే అధికారులు, పోలీసులు కలిసి డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలను సురక్షితంగా కిందికి దించారు. శుక్రవారం చోటు చేసుకున్న ఈ పరిణామాలతో సచివాలయ ప్రాంగణంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Reservation controversy Deputy Speaker and MLAs jumped from the Maharashtra Secretariat

కాగా, ధన్‌గడ్ కమ్యూనిటీని ఎస్టీ కేటగిరిలో చేర్చాలన్న డిమాండ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పరిగణలోకి తీసుకుంది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తోపాటు బీజేపీ ఎంపీ హేమంత్ సావ్రా, ఎమ్మెల్యేలు కిరణ్ లహమాటే, హిరామన్ ఖోస్కర్, రాజేశ్ పాటిల్ నిరసన చేపట్టారు.


ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలోని మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా వీరంతా కిందకు దూకారు. అయితే, అంతకుముందే అధికారులు మొదటి అంతస్తు వద్ద ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్‌లో వీరంతా పడ్డారు. గమనించిన పోలీసులు వెంటనే వారిని రక్షించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు అంతా సచివాలయం ముందు బైఠాయించి ఆందోళన కొనసాగించారు.

అనంతరం డిప్యూటీ స్పీకర్ జిర్వాల్ మాట్లాడుతూ.. ధన్‌గఢ్‌ కమ్యూనిటీ సభ్యుల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రకటించడంలో తమకు ఎలాంటి సమస్యలు లేవన్నారు. అయితే వారిని ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు సచివాలయం వద్దే ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వారితో సమావేశమై ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా,
సచివాలయం పైనుంచి కొందరు దూకేందుకు ప్రయత్నించిన ఘటనలు గతంలోనూ పలుమార్లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా 2018 ఫిబ్రవరిలో సచివాలయం మొదటి అంతస్తు వద్ద సేఫ్టీ నెట్ ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+