ఇతరుల సంప్రదాయాలు గౌరవించాలి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: అందరం ఇతర సంస్కృతి, సంప్రదాయాలను పరస్పరం గౌరవించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు అన్నారు. మంగళవారం నాడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రాయపూర్‌లో జరిగిన ప్రత్యక్ష ప్రసార సదస్సు విధానం ద్వారా ప్రసంగించారు.
శాంతి, సమైక్యత, సామరస్యతల కోసం ఇతరుల సంప్రదాయాలను, అభిప్రాయాలను ప్రజలు పరస్పరం గౌరవించుకోవాలన్నారు. అలా చేయకపోతే అభివృద్ధికి విఘాతం కలుగుతుందని చెప్పారు. దేశ భిన్నత్వం, సామరస్యతలు మన బలమన్నారు.
ఎంత సుసంపన్నత ఉన్నా శాంతి, సమైక్యతలు లేనిదే దానికి అర్థం ఉండదని ప్రధాని మోడీ అన్నారు. వందలాది భాషలు, భిన్న మతాలు, అనేక రకాల వైరుద్ధ్యాలున్నా శాంతియుతంగా జీవించడం సాధ్యమేనని ప్రపంచానికి భారత్ నిరూపించిందని చెప్పారు.
ఇది మన సంస్కృతి అని, మనం ఈ సంస్కృతిలోనే ఎదిగామని, దీనిని పరిరక్షించుకోవాలని ప్రధాని మోడీ చెప్పారు. మన యువత ఉద్యోగాలు అడిగేవారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా మారాలని ప్రధాని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications