KK Survey: మరోసారి సత్తా చాటిన కేకే సర్వే..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక్లలో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. మహాయుతి కూటమి 219 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ కూటమి 55 చోట్ల ముందంజలో ఉండగా.. ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే వస్తున్నాయి. మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ చూస్తే.. పీ మార్క్ ఎన్డీఏ కూటమి 137 నుంచి 157 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ కూటమి 126 నుంచి 146 చోట్ల గెలుపొందే అవకాశం ఉందని అంచనా వేసింది.
మ్యాట్రిజ్ ఎన్డీఏ కూటమికి 150 నుంచి 170, కాంగ్రెస్ కూటమికి 110 నుంచి 130 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే కేకే సర్వే మాత్రం ఒకటే నంబర్ ఇచ్చింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 220 స్థానాలను గెలుస్తుందని ప్రకటించింది. ఈ సర్వే తగ్గట్లుగానే మహారాష్ట్ర ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం మహాయుతి కుటమి 219 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేకే సర్వే చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయి.

ఏపీలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సునామీ తరహాలో విజయం సాధిస్తుందని కేకే సర్వే పేర్కొంది. 175 నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి 161 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. వైసీపీ 14 సీట్లల్లో మాత్రమే గెలుస్తుందని తెలిపింది. సర్వేలో అంచనా వేసినట్లుగానే ఫలితాలు వచ్చాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications