బెంగళూరులో రివాల్వర్ తో కాల్చుకుని మాజీ సైనికుడి ఆత్మహత్య, ఒంటరి, విపరీతంగా!
బెంగళూరు: జీవితంపై విరక్తి పెంచుకున్న మాజీ సైనికుడు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని హోరమావు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అనీల్ అహుజా (46) అనే మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడని సోమవారం పోలీసులు చెప్పారు.

మానసిక ఒత్తిడి
బెంగళూరు నగరంలోని హోరమావు సమీపంలోని ఎలైట్ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ నెంబర్ 113లో అనీల్ అహుజా నివాసం ఉంటున్నాడు. అనీల్ అహుజా మానసికంగా ఒత్తిడికి గురైనాడని అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు చెబుతున్నారు.

ఒక్క బుల్లెట్
ఫ్లాట్ లో ఒంటరిగా నివాసం ఉన్న అనీల్ అహుజా సోమవారం రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకి చప్పుడు కావడంతో అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు హోరమావు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మాజీ జవాను ఫ్యామిలీ
హోరమావు పోలీసులు సంఘటనా స్తలానికి చేరుకుని పరిశీలించగా అనీల్ అహుజా రివాలర్వ్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. వెంటనే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి అనీల్ అహుజా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని పోలీసులు చెప్పారు.

ఒంటరి జీవితం
చాలకాలం నుంచి అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో అనీల్ అహుజా ఒంటరిగా నివాసం ఉంటున్నాడన అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు, సెక్యూరిటీ గార్డులు సమాచారం ఇచ్చారని హోరమావు పోలీసులు అన్నారు.

విపరీతంగా !
జమ్మూ కాశ్మీర్ లో సైనికుడిగా పని చేసిన అనీల్ అహుజా రిటైడ్ అయ్యారు. తరువాత బెంగళూరు చేరుకుని నివాసం ఉంటున్న అనీల్ అహుజా విపరీతంగా అప్పులు చేశాడని, ఆ విషయంలో మానసికంగా ఒత్తిడికి గురైనాడని, అందువలనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని హోరమావు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications