దొంగతనాన్ని అడ్డుకున్నందుకు మాజీ ఆర్మీ ఆఫీసర్‌ను హత్య చేసిన దుండగులు
అమేథీ : ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. అమేథీలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. దొంగతనాన్ని అడ్డుకున్నందుకు మాజీ ఆర్మీ ఆఫీసర్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మాజీ సైనికాధికారి స్పాట్‌లోనే చనిపోయాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ అమేథిలోని గోడియాన్ కా పుర్వా గ్రామంలో మాజీ ఆర్మీ ఆఫీసర్ అమానుల్లా కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి కొందరు దుండగులు వారి ఇంట్లోకి ప్రవేశించి కర్రలతో ఆయనపై దాడి చేశారు. ఇంటి పక్కన ఉన్న షాపులో దుండగులు దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా గమనించిన అమానుల్లా వారిని అడ్డుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కక్ష పెంచుకున్న దుండగులు దాడికి పాల్పడ్డారు.

దుండగులు అమానుల్లా తలపై కొట్టడంతో ఆయన స్పాట్‌లోనే చనిపోయాడు. ఘటన జరిగిన సమయంలో అమానుల్లా ఆయన భార్య తప్పించి ఇతర కుటుంబసభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో ఈ దారుణం జరింది. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపారు. మృతుడి కుమారుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
మాజీ ఆర్మీ అధికారి హత్యపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ ఫైర్ అయ్యారు. యోగి ఆదిత్యనాథ్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పారు. ఇలాంటి ఘటనల్ని దాచే ప్రయత్నం చేయడం మానుకుని ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి వాటికి పరిష్కారం చూపాలని హితవు పలికారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications