Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏనుగు కలీమ్ రిటైర్మెంట్: తమిళనాడు, ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో సేవలు, ఘన వీడ్కోలు

తమిళనాడు అటవీ శాఖకు చెందిన ఏనుగు/కుమ్కీ అనమలై కలీమ్.. అడవి ఏనుగులను పట్టుకోవడంలో లేదా తరిమికొట్టడం కోసం పనిచేసింది.

చెన్నై: అటవీశాఖలో పనిచేసి రిటైర్ అయిన ఓ ఏనుగుకు ఘనంగా వీడ్కోలు పలికారు అధికారులు. తమిళనాడు అటవీ శాఖకు చెందిన ఏనుగు/కుమ్కీ అనమలై కలీమ్.. అడవి ఏనుగులను పట్టుకోవడంలో లేదా తరిమికొట్టడం కోసం పనిచేసింది. ఈ క్రమంలో 60 ఏళ్లు రావడంతో పదవీ విరమణ చేసింది. దాని పదవీ విరమణకు గుర్తుగా కోజికముతి ఏనుగు శిబిరంలో ఆ ఏనుగుకు ఐదుగురు ఫారెస్ట్ రేంజర్లు, ఇతర ఏనుగులు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.

కలీం.. మణి, కరుప్పన్ అనే అడవి ఏనుగును పట్టుకోవడం విజయవంతమైంది. ఇది కలీం 100వ ఆపరేషన్ అని, అయితే ఓ ఏనుగు సత్యమంగళం టైగర్ రిజర్వ్‌లో అదృశ్యమైందని అధికారులు చెప్పారు.

 Retired at 60: Heartwarming farewell for Tamil Nadu Forest Department elephant Kaleem

రాష్ట్ర పర్యావరణ శాఖ కార్యదర్శి సుప్రియా సాహు కలీమ్‌ రిటైర్‌మెంట్‌ను తెలుపుతూ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ ఏనుగు ఓ లెజెండ్‌ అని, దీని సేవలు ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. కాగా, ఈ వీడియోకు 161 వేల మందికిపైగా వీక్షించారు. 9,300 లైక్‌లతో వైరల్‌గా మారింది.

'తమిళనాడులోని కోజియాముట్టి ఏనుగు శిబిరానికి చెందిన ఐకానిక్ కుమ్కీ ఏనుగు కలీం 60 ఏళ్ల వయసులో ఈరోజు పదవీ విరమణ చేయడంతో మా కళ్లు చెమ్మగిల్లాయి. హృదయాలు కృతజ్ఞతతో బరువెక్కాయి. 99 రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్న ఈ ఏనుగు ఒక లెజెండ్. ఇది గౌరవ గార్డు అందుకున్నాడు. #TNForest #Kaleem' అని ఐఏఎస్ అధికారి ట్విట్ చేస్తూ వ్యాఖ్యానించారు.

కలీమ్ డిసెంబర్ 1972లో STR నుంచి తీసుకొచ్చారు. కోజికముతి ఏనుగు శిబిరంలో దాని మహోత్ పళనిసామి శిక్షణ ఇచ్చారు. పళనిసామి మరణానంతరం ఆయన మేనల్లుడు మణి.. కలీం మహౌట్‌గా మారారు. ఇతర కుమ్కీల లాగా పొడుగ్గా లేకపోయినా, కలీమ్ పొడవాటి శరీరం, దాదాపు ఐదు టన్నుల బరువు కలిగి ఉంది. అది తన బలం, నిర్భయతకు ప్రసిద్ధి. ఏనుగులు దూకుడుగా మారే మాస్త్ కాలంలో కూడా అన్ని పరిస్థితులను సజావుగా నిర్వహించగల ఈ ఏనుగు సామర్థ్యాన్ని మణి ప్రశంసించారు.

కలీం కేవలం తమిళనాడులోనే కాకుండా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి పొరుగు రాష్ట్రాలలో కూడా కార్యకలాపాలలో భాగస్వామి అయ్యింది. దీని పదవీ విరమణ ఐదు దశాబ్దాలుగా సాగిన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికింది. వన్యప్రాణుల రక్షణకు కలీమ్ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అధికారులు పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+