కుక్క కోసం.. మహిళపై చేయి చేసుకున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి...
కుక్కకోసం.. మహిళపై చేయిచేసుకున్నారు ఓ రిటైర్డ్ ఐఏఏస్ అధికారి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన పెంపుడు కుక్కను లిప్ట్‌లో తీసుకువస్తుందని మాజీ ఐఏఎస్ అధికారి ఓ మహిళతో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా ఆమెపై చేయి కూడా చేసుకున్నారు. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవర్తనపై విరుచుకుపడుతున్నారు.
కుక్కతో లిప్ట్‌లో రావడానికి నిరాకరించిన అధికారి : ఈ సంఘటన నోయిడా సెక్టార్‌లోని 108 పార్క్ లారేట్ సొసైటీలో చోటుచేసుకుంది. ఈ సొసైటీలో ఉండే ఎన్నో ఏళ్లుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్‌పి గుప్తా నివసిస్తున్నారు. అయితే, ఓ మహిళను తన పెంపుడు కుక్కతో లిప్ట్‌లో రావాడానికి ఆ అధికారి నిరాకరించారు. దాంతో వారిద్దరూ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దదయ్యి ఆ అధికారి ఏకంగా ఆ మహిళను చెంపదెబ్బ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ అధికారి మహిళలపై ప్రవర్తించిన తీరు ఇప్పుడు కాస్త వివాదంగా మారింది.

దీనిమీద నోయిడా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయగా, దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ వీడియోలో మాజీ ఐఎఎస్ అధికారి గుప్తా రికార్డ్ చేయకుండా ఆపడానికి ప్రయత్నించడం, ఆ మాజీ అధికారి మహిళను చెంపదెబ్బ కొట్టడం మనం చూడొచ్చు. ఆ మహిళ తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి దెబ్బలను అడ్డుకోవడానికి తన చేతిని ఉపయోగించడం ఇందులో కనిపిస్తుంది.
लिफ्ट में कुत्ता ले जाने का विवाद था। पहले रिटायर IAS ऑफिसर ने महिला को पीटा, फिर महिला ने पति से रिटायर साहब को पिटवाया।
— Sachin Gupta (@SachinGuptaUP) October 31, 2023
📍Parx Laureate सोसाइटी, नोएडा pic.twitter.com/E4dtwr8LG5
ఈ ఘటనలో ఇరువురి మధ్య గొడవ : ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త అక్కడికి వచ్చి మాజీ ఐఏఎస్ అధికారిని తీవ్రంగా దూషించినట్లు తెలుస్తోంది. దీనిమీద గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసు కమిషనరేట్ లో ఫిర్యాదు కూడా నమోదు చేశారు. "కుక్కను లిప్ట్0లోకి తీసుకెళ్లే క్రమంలో ఈ వివాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో ఏసీపీ-1 నోయిడా మాయ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఇరువర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. విచారణ తర్వాత, అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనరేట్ గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది.












Click it and Unblock the Notifications