కూతురికి ఊహించని షాక్ : నాన్న బట్టలన్ని విప్పి దారుణంగా..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : రెండు రోజుల్లో నాన్న పుట్టినరోజు.. గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంది కూతురు. నాన్న ఫోన్ కు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మళ్లీ ప్రయత్నించినా.. నో రెస్పాన్స్. ఎందుకో మనసులో అనుమానం మొదలైంది. అంతే.. ఇంటికెళ్లి చూస్తే అంతా షాక్.

ఢిల్లీకి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి విజయ్ కుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసి ఆయన్ను హత్య చేసినట్లు తెలుస్తోంది. విజయ్ కుమార్ కూతురైన ఢిల్లీ జర్నలిస్ట్ అంబిలి.. తండ్రికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో, అనుమానంతో ఇంటికెళ్లి బయలుదేరింది.

Retired senior citizzen murdered at home in Delhi

తీరా.. ఇంట్లోకి అడుగుపెడితే, అప్పటికే తలుపులు బద్దలు కొట్టి ఉన్నాయి. టీవీ స్టాండ్, సోఫాలో పడేసి ఉంది. లోపల విజయ్ కుమార్ బెడ్ రూమ్ గది కొంచెం తెరుచుకుని చీకటిగా ఉంది. లైట్స్ ఆన్ చేసి గదిలోకి వెళ్లింది అంబిలి. గదిలోని మ్యాట్ కింద దేన్నో దాచినట్లుగా అనిపించడంతో.. కాస్త తెరిచి చూసింది. అంతే.. నాన్న విజయ్ కుమార్ (65) మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ తిన్నది.

అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. రెండు రోజుల్లో నాన్న పుట్టినరోజు అంటూ అంబిలి కన్నీటి పర్యంతమయిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఇదిలా ఉంటే, విజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా 1994 లో కేరళ నుంచి ఢిల్లీకి వచ్చారు. అనంతరం 2011లో ఆయన రిటైర్ అయ్యారు. అతని భార్య ఆదాయ పన్ను శాఖలో విధులు నిర్వర్తిస్తోంది. ఇక కూతురు అంబిలి రాజ్యసభ టీవీలో జర్నలిస్టుగా పనిచేస్తుండగా, కుమారుడు దుబాయ్ లో ఉంటున్నారు.

విజయ్ కుమార్ హత్యకు సంబంధించి వివరాలేవి తెలియరాలేనప్పటికీ, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vijaykumar PB (65), father of a journalist, was found dead at his residence in Samachar Apartments on Wednesday. His daughter, Ambily, found his blood-stained body in the bedroom.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X